అన్నం పెట్టి మరీ మాట్లాడా, గిచ్చి కయ్యం పెట్టుకొంటున్నాడు: జగన్ పై కేసీఆర్ ఫైర్

By narsimha lodeFirst Published Aug 10, 2020, 8:10 PM IST
Highlights

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎంను పిలిచి అన్నం పెట్టి మరీ మాట్లాడానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎంను పిలిచి అన్నం పెట్టి మరీ మాట్లాడానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

సోమవారం నాడు ప్రగతి భవన్ లో ప్రగతి భవన్ లో నీటి పారుదల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.సముద్రంలో కలిసే 2 వేల టీఎంసీల్లో తెలంగాణకు వెయ్యి టీఎంసీలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుండి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. రెండు రాష్ట్రాల రైతుల కోసమే ప్రాజెక్టులు కట్టుకొందామని చెప్పినట్టుగా ఆయన చెప్పారు.  వృధాగా సముద్రం పాలౌతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లిద్దామని చెప్పినట్టుగా ఆయన ప్రస్తావించారు. 

also read:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో లేనిపోని గొడవలు: జగన్ పై బాబు

ఏపీ ప్రభుత్వం గిచ్చి కయ్యం పెట్టుకొంటుందన్నారు.  ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడం సరైంది కాదన్నారు. ఏపీ ప్రభుత్వం అర్ధం పర్థం లేని నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. 

ఏపీది అనవసర రాద్ధాంతమని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తప్పుడు విధానాలను అనుసరిస్తోందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీతో పాటు కేంద్రానికి గట్టిగా సమాధానం చెప్పాలని కేసీఆర్ చెప్పారు.

గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు తెలంగాణకు దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు దక్కిన వాటా ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నామన్నారు. 

click me!