కరోనాతో డీఎస్పీ మృతి... వైద్యానికే .15లక్షలు, అయినా దక్కని ప్రాణం

Arun Kumar P   | Asianet News
Published : Aug 10, 2020, 07:15 PM ISTUpdated : Aug 10, 2020, 07:19 PM IST
కరోనాతో డీఎస్పీ మృతి... వైద్యానికే .15లక్షలు, అయినా దక్కని ప్రాణం

సారాంశం

విధినిర్వహణలో భాగంగా కరోనాను సైతం లెక్కచేయని ఆ పోలీస్ అధికారిని అదే మహమ్మారి బలితీసుకుంది. 

వరంగల్: విధినిర్వహణలో భాగంగా కరోనాను సైతం లెక్కచేయని ఆ పోలీస్ అధికారిని అదే మహమ్మారి బలితీసుకుంది. కరోనా బారిన పడిన గతకొద్దిరోజులగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏఆర్ డీఎస్పీ శశిధర్ ఇవాళ మృతిచెందారు. 

కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్న అతడికి పాజిటివ్ గా తేలడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. ఇప్పటివరకు ఆయన వైద్యానికి  దాదాపు రూ.15లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. అయినప్పటికి ఆయన ప్రాణాలు దక్కలేదు. తోటి పోలీస్ కరోనాతో మృతిచెందడంతో జిల్లా పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు.

శశిధర్ ప్రస్తుతం వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఏఆర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో వేయికి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 1256 కేసులు రికార్డయ్యాయి. దీంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య 80751కి పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా కరోనా వల్ల 10 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 637కు చేరుకుంది.  

హైదరాబాదులో కరోనా కాస్తా ఊరటనిచ్చింది. గత 24 గంటల్లో 389 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. గతంలో 500కు మించి కొన్నిసార్లు, 400కు మించి కొన్నిసార్లు జిహెచ్ఎంసి పరిధిలో కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా 400కు దిగువన  కేసులు నమోద్యయాయి. కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో కేసులేమీ నమోదు కాలేదు. 

రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కూడా నిన్నటి కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 34 కేసులు మాత్రమే నమోద్యాయి. రంగారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో 86 కేసులు రికార్డయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 67 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 63
భద్రాద్రి కొత్తగూడెం 7
జిహెచ్ఎంసి 389
జగిత్యాల 13
జనగామ 20
జయశంకర్ భూపాలపల్లి 6
జోగులాంబ గద్వాల 14
కామారెడ్డి 8
కరీంనగర్ 73
ఖమ్మం 28
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 0
మహబూబ్ నగర్ 21
మహబూబాబాద్ 19
మంచిర్యాల 11
మెదక్ 9
మేడ్చెల్ మల్కాజిగిరి 34
ములుగు 3
నాగర్ కర్నూలు 38
నల్లగొండ 58
నారాయణపేట 12
నిర్మల్ 19
నిజామాబాద్ 33
రాజన్న సిరిసిల్ల 31
రంగారెడ్డి 86
సంగారెడ్డి 74
సిద్ధిపేట 45
సూర్యాపేట 20
వికారాబాద్ 6
వనపర్తి 12
వరంగల్ రూరల్ 11
వరంగల్ అర్బన్ 67
యాదాద్రి భువనగిరి 3
మొత్తం 1256

 

PREV
click me!

Recommended Stories

Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?