ఎన్నికల ప్రచార సభల్లో విపక్షాలపై కేసీఆర్ తన విమర్శల తీవ్రతను మరింత పెంచారు. పాలమూరు ఎన్నికల సభల్లో కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
గద్వాల: ఘన చరిత్ర ఉన్న గద్వాలను గబ్బు పట్టించిన వారు ఎవరని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.సోమవారంనాడు గద్వాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కృష్ణా, తుంగభద్ర నడుమ ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని కరువు సీమగా ఆగం చేసిన పార్టీ ఏది అని ఆయన ప్రశ్నించారు.
గద్వాల ప్రాంతంలో వాల్మీకి, బోయసోదరులుంటారని కేసీఆర్ చెప్పారు. వాల్మీకి, బోయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలుగా గుర్తించారని ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో వారు బీసీలుగా ఉన్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ విషయమై మోడీ సర్కార్ పై పోరాటం చేయాల్సిందేనన్నారు. నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలకు అన్యాయం చేశారని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రాలో ఎస్టీల్లో, తెలంగాణలో బీసీల్లో చేర్చి అన్యాయం చేశారన్నారు.
undefined
ఆనాడు వాల్మీకి, బోయలను ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రే అని ఆయన విమర్శలు చేశారు. ఆర్డీఎస్ ను ఆగం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి మంత్రులు ఏం చేశారో మీకు తెలుసునని చెప్పారు.ఇక్కడి నీళ్లు తీసుకుపోతుంటే హరతి పట్టి రఘువీరారెడ్డికి స్వాగతం పలికిన మంత్రి ఎవరో మీకు తెలుసునని కేసీఆర్ పరోక్షంగా డీకే అరుణపై విమర్శలు గుప్పించారు.
Live: ప్రజా ఆశీర్వాద సభ, గద్వాల్ https://t.co/Ahc5ZNd2y6
— BRS Party (@BRSparty)మోడీకి ఎన్ని లేఖలు రాసిన జిల్లాకు ఒక్క నవోదయ స్కూల్ కూడ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ధరణిని ఎత్తివేస్తామని , వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మూడు గంటలు సరిపోతుందని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావించారు.
also read:నేను చెప్పే మాటలు నిజం కాకపోతే ఓడించండి: దేవరకద్ర సభలో కేసీఆర్ సంచలనం
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ కావాలా, 24 గంటల విద్యుత్ కావాలా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ధరణిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కూడ ఆయన గుర్తు చేశారు. ధరణి ఎత్తివేస్తే రైతుబంధు ఎలా అమలు చేస్తామని ఆయన ప్రశ్నించారు. రైతుల కష్టాలు రాహుల్ గాంధీకి ఏం తెలుసునని ఆయన అడిగారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ ప్రజలను కోరారు.తెలంగాణ ఇస్తామని 2004లోనే హామీ ఇచ్చి ఆలస్యం చేశారని ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు.