తెలంగాణలో గెలిచి మహారాష్ట్రకు వస్తానని.. కాంగ్రెస్, బీజేపీ భయం అదే .. బీఆర్ఎస్‌ను ఓడించేందుకు కుట్ర: కేసీఆర్

By Siva Kodati  |  First Published Nov 18, 2023, 6:21 PM IST

నన్ను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే తనను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని.. ఇక్కడ నేను గెలిస్తే మహారాష్ట్రకు వెళ్తానని భయపడుతున్నాయని కేసీఆర్ చురకలంటించారు. 


పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుందో , ఇప్పుడెలా వుందో చూడాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో ఎక్కడ చూసినా కరువు, సాగునీరు, తాగునీరు, కరెంట్ కష్టాలు వుండేవన్నారు. తెలంగాణను ఆంధ్రలో కలిపి 58 ఏళ్ల పాటు కాంగ్రెస్ గోస పెట్టిందని కేసీఆర్ భగ్గున్నారు. కాంగ్రెస్ అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2వేలు పింఛను ఇస్తున్నారా అని ప్రశ్నించారు. 

తెలంగాణకు వచ్చి మాత్రం రూ.4 వేలు పింఛను ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని , బీఆర్ఎస్ గెలిస్తే పింఛన్లు క్రమంగా రూ.5 వేలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 50 ఏళ్లు కాంగ్రెస్ వాళ్లు ఎన్ని వాగ్థానాలు చేసి విస్మరించారో అందరికీ తెలుసునని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీటి తిరువా రద్దు చేశామని.. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతులు పండించిన పంటనంతా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. మరో పదేళ్ల పాటు ఇదే పాలన వుంటే రైతులు బాగుపడతారని.. సంపద పెంచుతూ, సంక్షేమ పథకాలు కూడా పెంచుతూ వెళ్తున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. 

Latest Videos

undefined

ALso Read: కేసీఆర్ అనుమతి లేనిదే చీమ కూడా చిటుక్కుమనదు.. ఆ సత్తా హరీష్‌కు ఉందా?: ఈటల

నన్ను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. అందుకే తనను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని.. ఇక్కడ నేను గెలిస్తే మహారాష్ట్రకు వెళ్తానని భయపడుతున్నాయని కేసీఆర్ చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పంజాబ్‌ను మించి 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోందని సీఎం చెప్పారు. టపాచ్‌పల్లి రిజర్వాయర్‌కు రూ.50 కోట్లు మంజూరు చేశామని ఇది అందుబాటులోకి వస్తే చేర్యాలలో కరువు అనేది వుండదన్నారు. 
 

click me!