ఒవైసీ కోసమే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ రికార్డులు సృష్టించారని ఆయన చురకలంటించారు.
ఒవైసీ కోసమే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వరంగల్‌లో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. మియాపూర్ భూముల్లో రూ.4 వేల కోట్ల స్కాం జరిగిందని అమిత్ షా ఆరోపించారు. అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను నిర్వహిస్తామని, ముస్లిం రిజర్వేషన్తు రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. కేసీఆర్ ప్రభుత్వ కుంభోణాలు లెక్కపెడితే రోజులు సరిపోవని అమిత్ షా దుయ్యబట్టారు.
కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో వుందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే అవినీతి, అక్రమాలని .. తెలంగాణలో మద్యం ఏరులైన పారుతోందని అమిత్ షా ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్‌దని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందని అమిత్ షా పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ రికార్డులు సృష్టించారని ఆయన చురకలంటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు .. 2జీ, 3జీ, 4జీ పార్టీలని అమిత్ షా సెటైర్లు వేశారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దళితుడిని సీఎంను చేయలేదని ఆయన దుయ్యబట్టారు.
undefined
ALso Read: తెలంగాణలో బీజేపీ గెలిస్తే .. బీసీ వ్యక్తే సీఎం, మతపరమైన రిజర్వేషన్లు రద్దు : అమిత్ షా సంచలన ప్రకటన
అంతకుముందు నల్గొండలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. ఒవైసీ మెప్పుకోసమే ఉర్దూని రెండో భాషగా గుర్తించిందన్నారు. స్మార్ట్ సిటీస్ కింద నల్గొండకు రూ.400 కోట్లు ఇస్తే ఏం చేశారని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఒవైసీ బెదిరింపులకు లొంగిపోయిందని.. ఆయన ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని అమిత్ షా తెలిపారు.
తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలుగా హోంమంత్రి అభివర్ణించారు. బీజేపీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని అమిత్ షా దుయ్యబట్టారు.