చుట్టపు చూపుగా వచ్చే భట్టి కావాలా .. ఆయన గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 21, 2023, 2:25 PM IST

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదని కేసీఆర్ జోస్యం చెప్పారు. తమ ప్రత్యర్ధి కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లోనూ అభివృద్ధి చేశామని.. పట్టు లేని భట్టి విక్రమార్క నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 


ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికీ ఏం జరగలేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధిరలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ది మోసాల చరిత్ర అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కరెంట్ లేదని.. భట్టి మధిరకు చుట్టపు చూపుతగా వచ్చిపోతారని కేసీఆర్ దుయ్యబట్టారు. గతంలో కంటే బీఆర్ఎస్‌కు రెండు సీట్లు పెరుగుతాయన్నారు. కాంగ్రెస్‌లో 20 మంది సీఎంలు వున్నారని .. కాంగ్రెస్ తీసుకొచ్చేది భూమాతానా, భూమేతనా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

పదేళ్లలో ఎక్కడా పంటలు ఎండలేదని సీఎం గుర్తుచేశారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో వుందని.. ఎవరూ అడగకున్నా దళితబంధు ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. భట్టి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని సీఎం చురకలంటించారు. భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదని కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని.. రాయి ఏదో, రత్నం ఏదో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రిజల్ట్స్ రోజున దుకాణం క్లోజ్ కాదు.. ఆ రోజే ప్రారంభమవుతుందని సీఎం అన్నారు. ప్రజలపై ప్రేమతో కాదు.. ప్రత్యేక పరిస్ధితుల్లోనే తెలంగాణ ఇచ్చారని కేసీఆర్ గుర్తుచేశారు. 

Latest Videos

పదేళ్లుగా ఒల్లు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. తమ ప్రత్యర్ధి కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లోనూ అభివృద్ధి చేశామని.. పట్టు లేని భట్టి విక్రమార్క నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అభ్యర్ధి గెలుపు బట్టే ప్రజల భవిష్యత్ వుంటుందని.. తెలంగాణ ఇవ్వడంలో అనేకసార్లు డోకా చేశారని కేసీఆర్ మండిపడ్డారు. చిత్తశుద్ధి, కమిట్‌మెంట్‌తో పనిచేశామని సీఎం తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఖమ్మం జిల్లాలో మరిన్ని ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని కేసీఆర్ వెల్లడించారు. 

click me!