మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూర్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు..

By SumaBala BukkaFirst Published Nov 21, 2023, 8:45 AM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికలకు 8 రోజులే గడువుండగా హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ మాజీ ఎంపీ ఇంట్లో దాడులు చేస్తోంది. 

హైదరాబాద్ : చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. సోమాజీ గూడాలోని వివేక ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంచిర్యాలలో వివేక్ నివాసంలోను ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. మాజీ ఎంపీ వివేక్ ఇళ్లు, కార్యాలయాలు, అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐదు రోజుల క్రితం వివేక్ కంపెనీలో అధికారులు రూ. 8 కోట్లు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం. 

ఐటీ రైడ్స్ కలకలం రేపడంతో.. చెన్నూరులోని వివేక్ ఏంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో చెన్నూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎంపీ వివేక్ మొన్నటివరకు బీజేపీలో ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటివరకు జరగని దాడులు.. పార్టీ మారిన తరువాతే జరగుతుండడంతో కావాలనే చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ. హుజురాబాద్, మునుగోడు ఎన్నికలకు వందల కోట్లు ఇచ్చింది వివేక్ కంపనీనే అని వినిస్తుంది. మంచిర్యాలలో 8 కోట్లు పట్టుకున్నవి వివేక్ సొమ్మే అని సమాచారం. ఈ డబ్బుల విషయంలోనే ఈటలకు - వివేక్ కి చెడిందని తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ మారగానే టార్గెట్ చేశారని అంటున్నారు. ఆదాయపు పన్నుశాఖ కాంగ్రెస్ నేతల టార్గెట్ గానే దాడులకు దిగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.  

click me!