Shabbir Ali: దళితులకు కేసీఆర్ ద్రోహం చేశారు.. బీఆర్ఎస్ పై షబ్బీర్ అలీ ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Nov 21, 2023, 10:20 AM IST

Telangana Congress: ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) పాల‌న‌లో అవినీతి కార‌ణంగా చాలా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేద‌ని కాంగ్రెస్ లీడ‌ర్, మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్ ఆరోపించారు. కేంద్రంలోని మోడీ స‌ర్కారు పైనా ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.
 


Telangana Assembly Elections 2023: దళిత బంధు ముసుగులో భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌,  ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) దళితులకు ద్రోహం చేస్తున్నారనీ, అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ లీడ‌ర్, మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్ ఆరోపించారు.  ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ఫ‌లాలు కొద్ది మందికే అందుతున్నాయ‌నీ, మ‌రీ ముఖ్యంగా ఆ పార్టీ నుంచి ఎంపిక చేసిన కొంతమంది కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. నిజామాబాద్‌లోని భవానీ నగర్‌ చౌరస్తాలో ఆదివారం నాడు నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. 

విస్తృత సమస్యల గురించి మాట్లాడుతూ, బీసీ బంధు, మైనార్టీ బంధు వంటి ఇతర ప్రభుత్వ పథకాలలో అవినీతి జరిగిందని ఆరోపించిన మ‌హ్మ‌ద్ అలీ, ఎమ్మెల్యేల ప్రమేయంపై కేసీఆర్ మందలించారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. స్థానిక ఆందోళనలను హైలైట్ చేస్తూ, షబ్బీర్ అలీ పట్టణంలోని అధ్వాన్న పరిస్థితులను ఎత్తి చూపారు. డ్రైనేజీ సమస్యలతో దోమల బెడద, నివాసితులకు తదుపరి ఆరోగ్య సమస్యలకు దారితీసిందన్నారు. దీని గురించి ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

Latest Videos

రానున్న ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి ఓటు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్దికి విరుద్ధంగా పట్టణం వాగ్దానం చేసిన ప్రగతికి నోచుకోలేదని షబ్బీర్ అలీ వాదించారు. ఇదే క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును టార్గెట్ చేస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. దశాబ్ద కాలం పాటు కొనసాగిన కేంద్ర ప్రభుత్వ పాలనను ప్రశ్నించిన షబ్బీర్ అలీ.. అదానీ, అంబానీలను ఉదాహరణగా చూపుతూ అభివృద్ది అనుకున్న కొందరికే లబ్ధి చేకూర్చాయని ఎత్తి చూపారు. అంతా అభివృద్ధి, అంద‌రి ప్ర‌గ‌తి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు, ప్రాంతాల‌ అభివృద్ధికి హామీ ఇస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

click me!