తెలంగాణలో భారీ వర్షాలపై కేసీఆర్ సమీక్ష:హెలికాప్టర్లకై ఆర్మీతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశం

By narsimha lode  |  First Published Jul 27, 2023, 12:21 PM IST

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై  సీఎం కేసీఆర్ సమీక్షించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 


హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై  తెలంగాణ సీఎం కేసీఆర్  ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.  ప్రగతి భవన్ నుండి సీఎం కేసీఆర్  రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై  అధికారులతో ఆరా తీశారు.భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో భారీ వర్షం నమోదైన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు.  రాష్ట్రంలోని పలు  ప్రాంతాల్లో  62 సెం. మీ ల వర్షపాతం నమోదైన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. 

మోరంచపల్లి గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ ను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం  కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు  సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో  సీఎస్  శాంతికుమారి సంప్రదింపులు జరుపుతున్నారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవడం కష్టం అవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది  ప్రభుత్వం. ఇప్పటికే మోరంచపల్లికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లిన విషయాన్ని అధికారులు  సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. 

Latest Videos

ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సీఎం కేసీఆర్ కు  సీఎస్ శాంతికుమారి  నివేదిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని  అధికారులు  సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు.గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 64 సెం. మీల వర్ష పాతం నమోదైందని సీఎస్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. 

also read:భారీ వర్షాలతో హైద్రాబాద్-వరంగల్ హైవేపై వరద నీరు: ట్రాఫిక్ మళ్లింపు

గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన వర్షపాతం నమోదైందని చెప్పారు. 200 ప్రాంతాల్లో  10 సెం. మీల పైగా వర్షపాతం నమోదైన విషయాన్ని అధికారులు  సీఎంకు వివరించారు.
 

click me!