బిచ్చగత్తెను ఢీ కొట్టి.. పారిపోయే యత్నంలో జనంపైకి కారు: పాతబస్తీ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణాలు

Siva Kodati |  
Published : Jun 26, 2021, 04:01 PM IST
బిచ్చగత్తెను ఢీ కొట్టి.. పారిపోయే యత్నంలో జనంపైకి కారు: పాతబస్తీ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణాలు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ పాతబస్తీ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆదిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ పాతబస్తీ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆదిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన మిత్రులతో కలిసి బెంజ్ కారులో బయటకు వచ్చిన ఆదిల్... శాలిబండ ఉప్పుగూడ ఫ్లై ఓవర్ మీదుగా ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో ఆదిల్ కారు హుస్సేనీ ఆలం పరిధిలో అదుపు తప్పి సాలమ్మ అనే మహిళను ఢీకొట్టింది.

సాలమ్మ అక్కడికక్కడే చనిపోవడంతో ఆదిల్ గ్యాంగ్ పారిపోయేందుకు ప్రయత్నించింది. ఆ కంగారులో కొద్దిదూరం వెళ్లి ఆటోతో పాటు పాదచారుల మీదకి ఆదిల్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సాలమ్మ మరణించగా.. ఏడుగురి పరిస్ధితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ప్రమాదానికి కారణమైన బెంజ్ కారును శాలిబండ సమీపంలో వదిలి పారిపోయారు ఆదిల్, అతని మిత్రులు. ఈ కేసులో ఆదిల్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీలో కొంతమంది యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని డీసీపీ గజరావు తెలిపారు. పాతబస్తీలో యువకులపై నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్