కరోనా తీవ్రత: అధికారులతో కేసీఆర్ కీలక సమీక్ష.. టీకాపైనే ప్రధాన చర్చ

Siva Kodati |  
Published : May 09, 2021, 06:12 PM IST
కరోనా తీవ్రత: అధికారులతో కేసీఆర్ కీలక సమీక్ష.. టీకాపైనే ప్రధాన చర్చ

సారాంశం

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం అధికారులతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కేసీఆర్‌ వారితో చర్చిస్తున్నారు. 

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం అధికారులతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కేసీఆర్‌ వారితో చర్చిస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వే వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఔషధాలు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో టీకాల కొరతను అధిగమించేందుకు వున్న అవకాశాలపై కేసీఆర్ ఈ సమీక్షలో చర్చిస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్ వుండదని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో కోవిడ్ పరిస్ధితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ తదిరత అంశాలపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... లాక్‌డౌన్ విధిస్తే ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని సీఎం అన్నారు.

Also Read:లాక్‌డౌన్ వల్ల నో యూజ్... తెలంగాణలో ఆ ఆలోచన లేదు : కేసీఆర్ సంచలన ప్రకటన

దీనితో పాటు ప్రజా జీవనం కుప్పకూలుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా పాజిటివ్ కేసులు తగ్గడం లేదని సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్, రెమ్‌డిసివర్‌పై ప్రధానితో ఫోన్‌లో మాట్లాడతానని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు భారీగా కరోనా రోగులు వస్తున్నారని సీఎం తెలిపారు. దీంతో రెమ్‌డిసివర్, వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణకు అదనంగా కేంద్రం కేటాయింపులు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 

కాగా, కరోనా నుండి  తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకొన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తొలిసారిగా గురువారం నాడు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. అనంతరం కరోనాపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?