మంత్రి కొప్పులకి కరోనా: హోం క్వారుంటైన్‌లో ఈశ్వర్

Published : May 09, 2021, 02:07 PM IST
మంత్రి కొప్పులకి కరోనా: హోం క్వారుంటైన్‌లో ఈశ్వర్

సారాంశం

 తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా సోకింది. ప్రస్తుతం మంత్రి హోంఐసోలేషన్‌లో ఉన్నారు.   

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా సోకింది. ప్రస్తుతం మంత్రి హోంఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. అంతేకాదు వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన కోరారు.  తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 

also read:నైట్ కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు.. పెళ్లిళ్లకు 100 , అంత్యక్రియలకు 20 మంది: తెలంగాణలో కొత్త ఆంక్షలు

గత రెండురోజులుగా అస్వస్థతగా ఉండడంతో ఆయన కోవిడ్19 పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. వైద్యుల సహాయం మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు  కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.  గత కొన్ని రోజుల నుంచి మంత్రి  కొప్పుల ఈశ్వర్ వరుస ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి తప్పించడంతో  హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై కూడ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టి పెట్టాడు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి