మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని అధికారులు, పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ప్రభుత్వ సంసిద్ధతను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామన్నారు సీఎం. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని అధికారులు, పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ప్రభుత్వ సంసిద్ధతను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామన్నారు సీఎం. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్రంలో మున్సిపల్ ఎన్నికల విషయంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.రిజర్వేషన్ల కేటాయింపు, వార్డుల విభజనకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో 75 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయమై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ విషయమై పిటిషనర్ల తరపున వాదనలను హైకోర్టు డివిజన్ బెంచ్ వింది. మున్పిపల్ ఎన్నికలపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
Also Read:municipal polls: న్యాయస్థానం తీర్పులో ట్విస్ట్, కేసీఆర్ కు వరం
ఈ వ్యాజ్యాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ అన్ని పక్షాల వాదనలను వింది. వార్డుల రిజర్వేషన్లు, మున్సిఫల్ చైర్మెన్లు రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని పిటిషనర్లు హైకోర్టు దృస్టికి తీసుకొచ్చారు.
ఈ విషయమై ప్రభుత్వం తన వాదనను హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు విన్పించింది.వార్డుల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చోటు చేసుకొందని బీసీ సంఘాలు కూడ ఆందోళన వ్యక్తం చేశాయి. రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని కూడ కొన్ని పార్టీలు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాయి.
అన్ని వర్గాల వాదనలను విన్న హైకోర్టు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పుపై మంగళవారం నాడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును చెప్పింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.
ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం నాడు తేల్చి చెప్పింది. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే విషయమై పిటిషనర్లు త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
Also Read:తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
మరోవైపు ఇప్పటికే స్టే ఉన్న75 మున్సిపాలిటీలపై హైకోర్టు సింగిల్ బెంచ్ వద్ద స్టేను వేకేట్ చేసుకోవాలని కూడ డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ సూచన మేుకు సింగిల్ బెంచ్ వద్ద ప్రభుత్వం స్టే వేకేట్ చేయించుకొనేందుకు ప్రయత్నాలను ప్రారంభించనుంది.
ఈ ప్రక్రియ కూడ ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వెంటనే పూర్తయ్యే అవకాశం లేకపోలేదు. మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని కూడ కేసీఆర్ సర్కార్ భావిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చైర్మెన్ స్థానాలను కైవసం చేసుకొనేందుకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం రంగం సిద్దం చేసుకొంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే.