ఏడు స్థానాల్లో మార్పులు : 115 మందితో బీఆర్ఎస్ జాబితా విడుదల చేసిన కేసీఆర్

By narsimha lode  |  First Published Aug 21, 2023, 2:45 PM IST

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను  తెలంగాణ సీఎం కేసీఆర్  ఇవాళ విడుదల చేశారు. 115 అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించారు.


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే  బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను తెలంగాణ సీఎం కేసీఆర్  సోమవారం నాడు ప్రకటించారు. 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్  ప్రకటించారు.ఇవాళ  మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఏర్పాటు  చేసిన  మీడియా సమావేశంలో అభ్యర్థుల జాబితాను  సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ప్రగతి భవన్ నుండి  సీఎం కేసీఆర్ నేరుగా  తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులున్నాయని  సీఎం కేసీఆర్ చెప్పారు. ఏడు సిట్టింగ్ లలో మార్పు చేసినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. 

కామారెడ్డి, గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు.  హూజూరాబాద్ లో కౌ శిక్ రెడ్డి, దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, వేములవాడలో  చల్మెడ లక్ష్మీ నరసింహారావు, ఉప్పల్ లో బండారు లక్ష్మారెడ్డిలు పోటీ చేయనున్నారు.జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇంకా కొంత అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ అభ్యర్థుల ప్రకటనను పెండింగ్ లో ఉంచినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
 

రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను (115 స్థానాలకు) ప్రకటించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌.

BRS Party Chief, CM Sri KCR announced the first list of BRS candidates (115 constituencies) for the forthcoming Telangana Assembly… pic.twitter.com/LNLohVSRVm

— BRS Party (@BRSparty)

Latest Videos


సంగారెడ్డి- చింతా ప్రభాకర్
పటాన్ చెరు- మహిపాల్ రెడ్డి
దుబ్బాక- కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్- కేసీఆర్
మేడ్చల్-  సీహెచ్ మల్లారెడ్డి
మల్కాజిగిరి-  మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్-  కేపీ వివేకానంద
కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు
ఉప్పల్-  బండారి లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం-  మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్‌బీనగర్-  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
మహేశ్వరం-  సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్రనగర్-  ప్రకాష్ గౌడ్
శేరిలింగంపల్లి-  అరికెపూడి గాంధీ
చేవేళ్ల-  కాలె యాదయ్య
పరిగి-  కె. మహేష్ రెడ్డి
వికారాబాద్-  డాక్టర్ ఆనంద్
తాండూరు-  రోహిత్ రెడ్డి
ముషీరాబాద్-  ముఠా గోపాల్
అంబర్ పేట-  కాలేరు వెంకటేష్
ఖైరతాబాద్-  దానం నాగేందర్
జూబ్లీహిల్స్-  మాగంటి గోపినాథ్
సనత్ నగర్-  తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్-  టి. పద్మారావు
కంటోన్మెంట్-  లాస్య నందిత
కొడంగల్-  పట్నం నరేందర్ రెడ్డి
నారాయణపేట - ఎస్. రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్-  వి.శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల-  సీహెచ్. లక్ష్మారెడ్డి
దేవరకద్ర-  ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి
మక్తల్-  చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి-  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల-  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ఆలంపూర్-  ఆబ్రహం
నాగర్ కర్నూల్-  గువ్వల బాలరాజు
కల్వకుర్తి-  జైపాల్ యాదవ్
షాద్ నగర్-  అంజయ్య యాదవ్
కొల్లాపూర్-  బీరం హర్షవర్ధన్ రెడ్డి
దేవరకొండ- రమావత్ రవీంద్రకుమార్
నాగార్జునసాగర్- నోముల భగత్
మిర్యాలగూడ- నల్లమోతు భాస్కర్ రావు
హుజూర్ నగర్-  శానంపూడి సైదిరెడ్డి
 కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట- గుంటకండ్ల జగదీష్ రెడ్డి
నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
భువనగిరి- పైళ్ల శేఖర్ రెడ్డి
నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి- గాదరి కిషోర్ కుమార్
ఆలేరు- గొంగిడి సునీత
జనగామ- పల్లా రాజేశ్వర్ రెడ్డి
స్టేషన్‌ఘన్ పూర్-  కడియం శ్రీహరి
పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు
డోర్నకల్- డి. రెడ్యానాయక్
మహబూబాబాద్- శంకర్ నాయక్
నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల- చల్లా ధర్మారెడ్డి
వరంగల్ వెస్ట్-  దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ తూర్పు-  నన్నపునేని నరేందర్
వర్ధన్నపేట-  ఆరూరి రమేష్
భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి
ములుగు- బడే నాగజ్యోతి
పినపాక- రేగా కాంతారావు
కోరుట్ల-కల్వకుంట్ల సంజయ్
ఖమ్మం- పువ్వాడ అజయ్
పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి
మధిర- లింగాల కమల్ రాజు
వైరా- మదన్ లాల్
సత్తుపల్లి- సండ్ర వెంకటవీరయ్య
కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు
ఆశ్వరావుపేట- మెచ్చా నాగేశ్వరరావు
భద్రాచలం- తెల్లం వెంకటరావు
సిర్పూర్- కోనేరు కోనప్ప
చెన్నూరు-  బాల్క సుమన్
బెల్లింపల్లి- దుర్గం చిన్నయ్య
మంచిర్యాల- ఎన్. దివాకర్ రావు
ఆసిఫాబాద్-  కోవా లక్ష్మి
ఖానాపూర్-  భూక్యా జాన్సన్ నాయక్
ఆదిలాబాద్-  జోగు రామన్న
బోథ్-  అనిల్ జాదవ్
నిర్మల్- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
ముథోల్- విఠల్ రెడ్డి
ఆర్మూర్- ఆశన్నగారి జీవన్ రెడ్డి
బోధన్- షకీల్ అమీర్ మహమ్మద్
జుక్కల్- హన్మంత్ షిండే
బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి- జాజుల సురేందర్ రెడ్డి
కామారెడ్డి- కేసీఆర్
నిజామాబాద్ అర్బన్-  బిగాల గణేష్ గుప్తా
నిజామాబాద్ రూరల్-  బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి


ధర్మపురి- కొప్పుల ఈశ్వర్
రామగుండం- కోరుకంటి చందర్ పటేల్
పెద్దపల్లి-  దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్- గంగుల కమలాకర్
చొప్పదండి-  సుంకే రవిశంకర్
వేములవాడ-  చల్మెడ లక్ష్మీనరసింహారావు
సిరిసిల్ల- కేటీఆర్
మానకొండూరు- రసమయి బాలకిషన్
హూజూరాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
హుస్నాబాద్- వొడితెల సతీష్ కుమార్
సిద్దిపేట- హరీష్ రావు
మెదక్- పద్మా దేవేందర్ రెడ్డి
నారాయణఖేడ్- భూపాల్ రెడ్డి
ఆంథోల్- క్రాంతికిరణ్ చంటి

జహీరాబాద్- మాణిక్ రావు

ఇల్లందు-హరిప్రియానాయక్

సామాజిక వర్గాల వారీగా ..

 బీఆర్ఎస్ జాబితాలో  58 మంది ఓసీలు,  20 మంది ఎస్సీలు, 12 మంది ఎస్టీలకు ,  ముగ్గురు మైనార్టీలు, ఏడుగురు మహిళలకు సీట్లు దక్కాయి.రెడ్డి సామాజిక వర్గానికి  40, 11 మంది వెలమ, ఐదుగురు కమ్మ, వైశ్య , బ్రహ్మణ సామాజిక వర్గాలకు  ఒక్కొక్కరికి సీట్లు కేటాయించారు.మున్నూరు కాపులో  10, యాదవ, ఐదు, గౌడ నలుగురు,  బెస్త 1, వంజర, పద్మశాలికి ఒక్కరికి చొప్పున సీటు కేటాయించారు. లంబాడీ ఏడు, ఆదీవాసీలకు ఐదు , మాదిగ 11, మాల 8, నేతకాని సామాజిక వర్గాలకు  ఒక్క సీటు కేటాయించారు.
 

click me!