అభ్యర్థుల జాబితా: తెలంగాణ భవన్ కు చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

Published : Aug 21, 2023, 02:38 PM IST
అభ్యర్థుల జాబితా: తెలంగాణ భవన్ కు  చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

సారాంశం

తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు క్యూ కట్టారు. ఇవాళ  అభ్యర్థుల జాబితాను  సీఎం విడుదల చేయనున్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ తొలి జాబితాలో చోటు దక్కిన సమాచారం అందిన  ఆ పార్టీ చెందిన  ప్రజా ప్రతినిధులు  సోమవారంనాడు మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు  చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం  తెలంగాణ భవన్ లో  సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.  అయితే  టిక్కెట్లు  ఖరారైన అభ్యర్థులకు  ఆయా జిల్లాలకు చెందిన మంత్రుల ద్వారా  సమాచారం వెళ్లింది.  ఈ సమాచారం అందుకున్న వారంతా  తెలంగాణ భవన్ కు  చేరుకున్నారు.

 పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు  తెలంగాణ భవన్ కు  చేరుకున్నారు.  ఈ ఏడాది చివరలో  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే  ముందుగానే అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మంచి ముహుర్తం ఉండడంతో  ఇవాళ  తెలంగాణ భవన్ లో  అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని  కేసీఆర్  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే