కొండగట్టు ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు : ఏరియల్ సర్వే

By narsimha lodeFirst Published Feb 15, 2023, 11:57 AM IST
Highlights

 కొండగట్టు ఆలయాన్ని  పునర్మిర్మాణం  చేయాలని  తెలంగాణ ప్రభుత్వం  నిర్ణయించింది.  ఈ మేరకు కొండగట్టు ఆలయాన్ని  కేసీఆర్  ఇవాళ  దర్శించుకున్నారు.  

కరీంనగర్: తెలంగాణ  సీఎం కేసీఆర్  బుధవారం నాడు   కొండగట్టు ఆలయంలో  ప్రత్యేక  పూజలు  నిర్వహించారు. ఇవాళ ప్రత్యేక హెలికాప్టర్ లో  సీఎం కేసీఆర్   కొండగట్టుకు  చేరుకున్నారు.  హెలికాప్టర్ లో  కొండగట్టు ఆలయాన్ని  ఏరియల్ సర్వే నిర్వహించారు కేసీఆర్ . కొండగట్టు ఆలయంలో  అర్చకులు,  ఆలయ అధికారులు  పూర్ణకుంభంతో  కేసీఆర్  కు స్వాగతం పలికారు.  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వేద పండితులు  కేసీఆర్ కి  తీర్ధ ప్రసాదాలు అందించారు.

అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను  సీఎం  పరిశీలించారు.ఆ తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులతో  సీఎం  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు,చేర్పులపై సమాలోచనలు జరిపారు.

25 ఏళ్ల తర్వాత  తెలంగాణ సీఎం కేసీఆర్  కొండగట్టు ఆలయానికి  వచ్చారు.  1998లో  కేసీఆర్  కొండగట్టు ఆలయానికి వెళ్లారు.  ఆ తర్వాత  కొండగట్టు ఆలయానికి వెళ్లలేదు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్  ఇవాళ కొండగట్టు ఆలయానికి  చేరుకున్నారు. 

జగిత్యాల  జిల్లా కేంద్రంలో  నిర్వహించిన  సభలో  కొండగట్టు ఆలయానికి  రూ. 100  కోట్లు   కేటాయిస్తామని  కేసీఆర్  ప్రకటించారు.  ఈ ప్రకటనకు అనుగుణంగా  రూ. 100 కోట్లను కొండగట్టు  ఆలయానికి  కేటాయిస్తున్నట్టుగా  రాష్ట్ర ప్రభుత్వం  జీవో విడుదల  చేసింది. 

also read:25 ఏళ్ల తర్వాత కొండగట్టుకు కేసీఆర్: ఆలయ పునర్నిర్మాణంపై దిశా నిర్ధేశం

యాదాద్రి  ఆలయాన్ని పునర్నిర్మించినట్టుగానే కొండగట్టు ఆలయాన్ని  పునర్మిర్మించాలని  కేసీఆర్ తలపెట్టారు.  యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను  పర్యవేక్షించిన  ఆనంద్ సాయి  స్థపతి  నేతృత్వంలో  పునర్మిర్మాణ పనులు  చేపట్టనున్నారు.

click me!