గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై విచారణ: దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్

By narsimha lode  |  First Published Feb 15, 2023, 10:27 AM IST

గోదావరి ఎక్స్ ప్రెస్  రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పిన  ప్రాంతాన్ని  దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్  ఇవాళ పరిశీలించారు.  


హైదరాబాద్:  ఘట్ కేసర్  వద్ద  గోదావరి  ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన  ఆరు బోగీలు   పట్టాలు తప్పిన  ఘటనపై   విచారణ చేస్తున్నామని  దక్షిణ మధ్య రైల్వే  జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు.

బుధవారం నాడు   గోదావరి ఎక్స్ ప్రెస్  రైలు పట్టాలు తప్పిన  ప్రాంతాన్ని  జీఎం  అరుణ్ కుమార్ జైన్  పరిశీలించారు.  ట్రాక్ పునరుద్దరణ పనులను  జీఎం పర్యవేక్షించారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్టణం నుండి  సికింద్రాబాద్ కు బయలుదేరిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు  ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పినట్టుగా  ఆయన  చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు  ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

Latest Videos

undefined

also read:పట్టాలు తప్పిన ఐదు బోగీలు అక్కడే: సికింద్రాబాద్‌కి చేరిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు

ప్రమాదానికి గల కారణాలపై  విచారణకు  ఆదేశాలు జారీ చేసినట్టుగా జీఎం అరుణ్ కుమార్ చెప్పారు.  గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు   ఘటనలో  ఎవరికీ  ఎలాంటి ప్రమాదం జరగలేదని  దక్షిణ మధ్య  రైల్వే జీఎం   అరుణ్ కుమార్  జైన్ ప్రకటించారు.  ఇవాళ రాత్రి  వరకు  ట్రాక్  పునరుద్దరణ పనులు  చేపడుతామని  జీఎం  తెలిపారు.   గోదావరి ఎక్స్ ప్రెస్ రైలులోని ప్రయాణీకులను  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా  గమ్యస్థానాలకు  చేర్చినట్టుగా   ఆయన  తెలిపారు.  
 

click me!