మంత్రులు, అధికారులతో కేసీఆర్ కీలక భేటీ: వీటిపైనే చర్చ

By narsimha lode  |  First Published May 27, 2020, 3:14 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులు, మంత్రులతో ప్రగతి భవన్ లో బుధవారం నాడు సమావేశమయ్యారు. తెలంగాణ అవతరణ దినోత్సవాల నిర్ణయంపై కూడ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులు, మంత్రులతో ప్రగతి భవన్ లో బుధవారం నాడు సమావేశమయ్యారు. తెలంగాణ అవతరణ దినోత్సవాల నిర్ణయంపై కూడ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నెల 31వ తేదీతో లాక్ డౌన్ ముగిసే అవకాశం ఉంది. నాలుగో విడత లాక్ డౌన్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రంగాలకు ఆంక్షలను సడలించారు. ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

Latest Videos

undefined

ఈ నెల 19వ తేదీ నుండి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సు సర్వీసులను ప్రభుత్వం నడపడం  లేదు. మరో వైపు మెట్రో రైల్ సర్వీసులు కూడ నడపడం లేదు. హైద్రాబాద్ లో సిటీ బస్సులు, మెట్రో రైలు సర్వీసుల విషయమై కూడ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

also read:నివేదికలివ్వండి: కరోనా పరీక్షలపై తెలంగాణ సర్కార్ పై హైకోర్టు అసంతృప్తి

పబ్‌లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ను ఓపెన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇస్తోందా ఇవ్వదా అనే విషయం కూడ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరో వైపు అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ప్రభుత్వం చర్చించనుంది.

తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు ఉన్నాయి. అయితే ఏపీ, మహారాష్ట్రల్లో ఎక్కువగా కరోనా కేసులు  నమోదౌతున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల నుండి బస్సు సర్వీసుల రాకపోకలకు అనుమతిని ఇస్తారా  అనేది చర్చనీయాంశంగా మారింది.పలువురు మంత్రులు ఈటల రాజేందర్, పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డిలతో పాటు ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

జీహెచ్ఎంసీ పరిధిలోనే రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీంతో హైద్రాబాద్ లో  ఎలాంటి చర్యలు తీసుకొంటారనే విషయమై చర్చ సాగుతోంది.వ్యవసాయం, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖపై ప్రధానంగా సీఎం ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. మరో వైపు  జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కూడ ప్రధానంగా చర్చించనున్నారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సాదా సీదాగా నిర్వహించే అవకాశం ఉంది. నిరాడంబరంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. లాక్ డౌన్ ను కొనసాగిస్తూ మరిన్ని సడలింపులు ఇస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు. 
 

click me!