బ్రేకింగ్... వామనరావు హత్యకేసు నిందితులకు తప్పిన ప్రమాదం

By Arun Kumar PFirst Published Mar 9, 2021, 5:15 PM IST
Highlights

తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వోకేట్స్ వామనరావు దంపతుల హత్యకేసులో నిందితులు ప్రమాదానికి గురయ్యారు.  

పెద్దపల్లి: తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వోకేట్స్ వామనరావు దంపతుల హత్యకేసులో నిందితులు ప్రమాదానికి గురయ్యారు.  మీడియాకు చిక్కకుండా పోలీసులు నిందితులను మంథని కోర్ట్ ప్రాంగణంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నంలో వరంగల్ జైల్ నుండి నిందితులను తీసుకువచ్చిన మినీ బస్ గోడను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులోనే వున్న నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్ లకు  గానీ, పోలీసులకు గానీ ఎలాంటి గాయాలు కాలేవు. అయితే పోలీస్ వాహనం అద్దాలు మాత్రం ధ్వంసమయ్యాయి. 

ఈ ఏడాది ఫిబ్రవరి 17వ  తేదీన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద నడిరోడ్డుపై అడ్వకేట్ వామన్ రావు దంపతులను దుండగులు నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసును ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేస్తోంది. ఈ హత్య కేసుపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

read more   కొన ఊపిరితో వాంగ్మూలం.. చర్యలు శూన్యం, పార్లమెంట్‌లో మాట్లాడతా: వామన్‌రావు హత్యపై ఉత్తమ్

ఈ కేసుపై విచారణ సమయంలో ఇప్పటికే అడ్వకేట్ జనరల్ ను  తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. అడ్వకేట్ జనరల్ డీఎస్ ప్రసాద్ వాదనలను విన్పించారు. తీవ్ర గాయాలు ఉన్న కారణంగా వామన్ రావు నుండి మరణ వాంగూల్మం రికార్డు చేయడం సాధ్యం కాలేదన్నారు.

సాక్షుల విచారణ కొనసాగుతోందని ఏజీ తెలిపారు. బస్సులోని సాక్షులను గుర్తించినట్టుగా ఆయన హైకోర్టుకు వివరించారు. ఈ హత్య జరిగిన సమయంలో ఆ రోడ్డు వెంట వెళ్తున్న వారిని కూడ గుర్తించామన్నారు.  ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్ ను మంథని కోర్టులో రికార్డు చేస్తున్నామని ఏజీ ఉన్నత న్యాయానికి వివరించారు.బస్సు డ్రైవర్, కండక్టర్లను కూడా సాక్షులుగా చేర్చామన్నారు. ఈ కేసుపై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది.
  
 

 
 

click me!