ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ ప్రకటన: రంగంలోకి కేసీఆర్.. మోడీకి లేఖ, వ్యవసాయంపై ప్రభావమేనంటూ ఆవేదన

Siva Kodati |  
Published : Mar 23, 2022, 08:06 PM ISTUpdated : Mar 23, 2022, 08:11 PM IST
ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ ప్రకటన: రంగంలోకి కేసీఆర్.. మోడీకి లేఖ, వ్యవసాయంపై ప్రభావమేనంటూ ఆవేదన

సారాంశం

తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయలేమంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఈ మేరకు రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి లేఖ రాశారు.

ధాన్యం కొనుగోలుకు (paddy procurement) సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి (pm narendra modi) సీఎం కేసీఆర్ (kcr)) లేఖ రాశారు. తెలంగాణలో పండిన వరిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. కొనకపోతే వరికి కనీస మద్ధతు ధరకు అర్ధం లేదని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార భద్రత లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్లేనని కేసీఆర్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులను ప్రోత్సహించామని.. పత్తి, పామాయిల్, రెడ్‌గ్రామ్ వేయాలని కోరామని సీఎం వెల్లడించారు. రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరిసాగు పెట్టించామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ నుంచి వరిని కొనుగోలు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 

అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (piyush goyal) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమన్నారు. ఈ మేరకు లోక్‌సభలో పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. సరఫరా పరిస్ధితుల ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయన్నారు. అదనంగా వున్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోళ్లు వుంటాయని పీయూష్ గోయల్ వెల్లడించారు. 

కాగా.. యాసంగిలో Paddy ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం నాడు Delhiకి బయలు దేరిన సంగతి తెలిసిందే. Punjab  రాష్ట్రం నుండి కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది. ఈ విషయమై కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలిసేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లారు.

సోమవారం నాడు TRS శాసనసభపక్ష సమావేశం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సమావేశం తర్వాత యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని  ఈ సమావేశం డిమాండ్ చేసింది. కేసీఆర్ ఆదేశం మేరకు ఇవాళ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆహార్ శాఖ మంత్రి Piyush Goyal  ను కలిసి రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోతే తెలంగాణ తరహలోనే పోరాటం నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారు.

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?