తమిళనాడుకు కేసీఆర్: శ్రీరంగనాథఆలయంలో పూజలు, రేపు స్టాలిన్‌తో భేటీ

Published : Dec 13, 2021, 03:24 PM ISTUpdated : Dec 13, 2021, 03:33 PM IST
తమిళనాడుకు కేసీఆర్: శ్రీరంగనాథఆలయంలో పూజలు, రేపు స్టాలిన్‌తో భేటీ

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో తమిళనాడుకు వెళ్లారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడుకు బయలుదేరారు. తమిళనాడులోని శ్రీరంగనాధస్వామి ఆలయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేయనున్నారు.ఇవాళ మధ్యాహ్నం భేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ సహా ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. తమిళనాడు రాష్ట్రంలోని sri Ranganatha temple ఆలయంలో Kcr కుటుంబసభ్యులు  ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

also read:KCR Tamil Nadu Visit: నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్.. రంగనాథస్వామి ఆలయంలో పూజలు.. సీఎం స్టాలిన్‌తో భేటీ..!

Hyderabadనుండి నేరుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయం చేరుకొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఎస్ఆర్ఎం హోటల్ కు చేరుకొంటారు.  ఆ తర్వాత శ్రీరంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారిని దర్శనం చేసుకొన్న తర్వాత రాత్రికి కేసీఆర్ చెన్నైకి చేరుకొంటారు. రాత్రికి అక్కడే ఆయన బస చేస్తారు. మంగళవారం నాడు తమిళనాడు సీఎం స్టాలిన్ తో ఆయన భేటీ కానున్నారు. గతంలోనే Tamilnadu సీఎం Stalin తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల్లోని బీజేపీయేతర సీఎంలకు లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ పోరాటానికి సన్నద్దం కావాలని స్టాలిన్ లేఖ రాశాడు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మరో వైపు స్టాలిన్ తరపున ఆ పార్టీ ప్రతినిధి బృందం కూడ హైద్రాబాద్ కు వచ్చి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Ktr ను కలిసి వెళ్లారు.  బీజేపీకి వ్యతిరేకంగా  అన్ని పార్టీలను కూడగడుతానని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు స్టాలిన్ తో భేటీలో కేసీఆర్ చర్చించే  అవకాశం ఉంది. Paddy ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంతో తాడోపేడో తేల్చుకొనేందుకు టీఆర్ఎస్  ప్రయత్నిస్తోంది. వరి ధాన్యం కొనుగోలు విషయమై Bjp సర్కార్ తీరును టీఆర్ఎస్ విమర్శిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీరును పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎండగట్టే ప్రయత్నం చేసింది.  వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో  నిరసనకు దిగారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu