ఇప్పటికే 1280 ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత... ఇదీ రాష్ట్రంలో పరిస్థితి..: మంత్రి గంగుల

Arun Kumar P   | Asianet News
Published : Dec 13, 2021, 03:17 PM ISTUpdated : Dec 13, 2021, 03:53 PM IST
ఇప్పటికే 1280 ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత... ఇదీ రాష్ట్రంలో పరిస్థితి..: మంత్రి గంగుల

సారాంశం

తెలంగాణలో ప్రస్తుతం రైతుల నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో తెలిపారు. 

హైదరాబాద్: తెలంగాణలో రైతుల (telangana farmers) నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) స్పష్టం చేసారు. గత ఏడాది కంటే 30శాతం అధికంగా ఈరోజు వరకు ధాన్యం సేకరణ (Paddy Procurement) చేసామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వానికి నిధుల కొరత లేనేలేదని మంత్రి గంగుల తెలిపారు. 

సోమవారం తన కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మంత్రి అధికారులతో చర్చించారు.  

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో గత సంవత్సరం ఇదే రోజు కన్నా దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఏడు అధికంగా కొనుగోలు చేసామని మంత్రి గంగుల తెలిపారు. ఇప్పటికే పదమూడు జిల్లాల్లో 1280 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయి మూసివేసామన్నారు.  రూ.5447 కోట్లను ఇప్పటికే రైతుల అకౌంట్లలో వేశామన్నారు. ఓపీఎంఎస్ లో నమోదైన వెంటనే రైతుల అకౌంట్లలో నిధుల్ని జమచేస్తున్నామని మంత్రి గంగుల స్పష్టం చేసారు. 

read more  యాసంగిలో వరి.. ప్రగతిభవన్, ఫాంహౌస్‌ నుంచి బయటకొస్తే : కేసీఆర్‌పై ఈటల విమర్శలు

ఇప్పటివరకయితే 6775 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. నిన్నటి(ఆదివారంఏ వరకూ 42.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని, వీటి విలువ రూ.8268 కోట్లు వుంటుందన్నారు. ఒపీఎంఎస్ లో నమోదైన 4 లక్షల 50వేల మంది రైతుల్లో 3 లక్షల 75వేల మందికి పేమెంట్ సైతం పూర్తి చేసామన్నారు. 

రాష్ట్రంలో ట్రాన్స్ పోర్టు, గన్నీల కొరత లేదన్నారు. కరోనా (corona) సంక్షోభంలోనూ వానాకాలం వడ్ల కొనుగోళ్లు నిరంతరాయంగా చేస్తున్నామన్నారు మంత్రి గంగుల. ఎఫ్.సి.ఐ (FCI) గోదాములు తెలంగాణలో దాదాపుగా అన్నీ నిండిపోయాయని... ముఖ్యంగా సూర్యాపేట (suryapet), సిద్దిపేట (siddipet), సంగారెడ్డి (sangareddy), మెదక్ (medak), మహబూబ్ నగర్ (mahabubnagar), నిర్మల్ (nirmal) లో గోదాములు పూర్తిగా నిండిపోయాయన్నారు. మిగతా చోట్ల సైతం నిలువ కొరత వేదిస్తుందని మంత్రి తెలిపారు.

read more  బియ్యం తీసుకోవడానికి కేంద్రం సిద్ధం.... కేసీఆర్ వరి వేయొద్దంటున్నారు: ఈటల రాజేందర్

ఎఫ్.సి.ఐ గోదాములను, గోడౌన్లను లీజుకు తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు దీనికి తోడు సరైన సమయానికి ర్యాక్ లు పంపకపోవడంతో గోదాముల నుండి భియ్యం తరలింపు జరగడం లేదని... దీంతో మిల్లుల్లో ఉన్న బియ్యాన్ని ఎఫ్.సి.ఐ గోదాముల్లోకి తీసుకోలేకపోతుందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి (union goverment), ఎఫ్.సి.ఐ కు విజ్ణాపన లేఖలు పంపిందని... అయినా ఎలాంటి స్పందనా లేదన్నారు. 

ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం వానాకాలం ధాన్యం సేకరణను వేగవంతంగా చేస్తోందని పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల స్పష్టం చేసారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్