
హైదరాబాద్: Telangana సీఎం KCR సోమవారం నాడు Delhiకి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఇవాళ రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో నిర్మిస్తున్న TRS భవన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ మంగళవారం నాడు పరిశీలించనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ kejriwal తో కూడా కేసీఆర్ భేటీ కానున్నారు.
BJPకి వ్యతిరేకంగా ఎన్డీయేతర పార్టీలు, సీఎంలను కేసీఆర్ కలుస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ సీఎంతో కూడా భేటీ కానున్నారు.ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ తో కలిసి పనిచేయనున్నారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగింది.
మరో వైపు BJPపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తన దాడిని తీవ్రం చేశారు. బీజేపీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ విమర్శలకు బీజేపీ కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. మరో వైపు ఎన్డీయేతర పార్టీలతో సమావేశాలను కేసీఆర్ వేగవంతం చేశారు.
ఎన్నికలకు తెలంగాణలో మరో ఏడాది సమయం ఉంది. అయతే ఈ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ టీమ్ తో ఒప్పందం కుదుర్చుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ పనిచేయనుంది.ఈ విషయాలపై ప్రశాంత్ కిషోర్ టీమ్ పనిచేయనుంది.
మరో వైపు క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు సంబంధించి ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ అందించనుంది. ఆదివారం నాడు మల్లన్నసాగర్ ను సినీ నటుడు ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ లు పరిశీలించనున్నారు. రిజర్వాయర్ లో నీటి నిల్వ సామర్ధ్యంతో పాటు నిర్వాసితులను కలిసి వారు మాట్లాడారు. ప్రాజెక్టులను ప్రశాంత్ కిషోర్ టీమ్ పరిశీలించనుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలనే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అంతకుముందు తమిళనాడు సీఎం స్టాలిన్ తో సఃమావేశమయ్యారు. హైద్రాబాద్ కు వచ్చిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరథ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తో జాతీయ రాజకీయాలపై చర్చించారు.
బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ తన గళాన్ని విన్పించాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ క్రమంలోనే బీజేపీయేతర పార్టీలు, నేతలను కలుస్తున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీతో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.గతంలో కూడా తెలంగాణ సీఎం మమత బెనర్జీతో సమావేశమయ్యారు. బీజేపీ వ్యతిరేక పోరు విషయమై చర్చించారు. బెంగాల్ లో బీజేపీని ఓడించి మమత బెనర్జీ విజయం సాధించారు. దీంతో బీజేపీ పై ఆమె రెట్టించిన ఉత్సాహంతో విమర్శలు చేస్తోంది.
జాతీయ రాజకీయాల్లో కూడా తాను కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ ఇటీవల కాలంలో ప్రకటించారు. ఈ విషయమై ఇటీవల జరిగిన సభల్లో బీజేపీకి వ్యితిరేకంగా తాను పోరాటం చేయాలా వద్దా అని ప్రజలను అడుతున్నారు. దేశాన్ని సక్రమమైన పద్దతిలో నడిపేందుకు గాను తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోఫించాలని భావిస్తున్నానని కేసీఆర్ చెప్పారు.