
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై (KCR) బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ (Tarun Chugh) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పొలిటికల్ టూరిజం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి పొలిటికల్ టూరిస్టులా తిరుగుతున్నడని విమర్శించారు. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు కేసీఆర్ పర్యటనలు అని ఎద్దేవా చేశారు. ఉక్రెయిన్ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుంది అంట.. కేసీఆర్ భారతదేశానికే కాదు ఉక్రెయిన్‌కు కూడా ప్రధాని అవ్చొచ్చు అని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
అవినీతి బయటపడుతుందనే కేసీఆర్.. ఫ్రంట్ పేరుతో డ్రామాలు చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. కేసీఆర్ ముఖంలో భయం కనిపిస్తుందన్నారు. కేసీఆర్ ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నారని విమర్శించారు. కుటుంబ పాలన చేస్తున్నవారికే వ్యూహకర్తలు అవసరమని అన్నారు. తమకు ప్రశాంత్ కిషోర్ లాంటి వారి అవసరం లేదని చెప్పారు. ఏ ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్‌ను కాపాడాలేరని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ వల్ల ఒరిగేదేమీ లేదని తరుణ్ చుగ్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తతో సమానమని అన్నారు. తాము చేస్తున్న పోరాటం తెలంగాణను కాపాడుకునేందుకే అని అన్నారు.