గవర్నర్‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్: బడ్జెట్ సమావేశాలపై సంచలన నిర్ణయం..

Published : Feb 28, 2022, 05:17 PM ISTUpdated : Mar 06, 2022, 08:20 PM IST
గవర్నర్‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్: బడ్జెట్ సమావేశాలపై సంచలన నిర్ణయం..

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తేదీలు ఖరారయ్యారు. మార్చి 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 7వ తేదీ ఉదయం 11.30 అసెంబ్లీ ప్రారంభం కానుంది. అయితే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.


తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తేదీలు ఖరారయ్యారు. మార్చి 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 7వ తేదీ ఉదయం 11.30 అసెంబ్లీ ప్రారంభం కానుంది. అయితే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం తేలకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ఇక 2014, 1970లలో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. 

రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. మార్చి 7వ తేదీన ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఎజెండా తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్.. బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి, సీఎంవో అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. 

బీజేపీపై పోరులో భాగంగానే..!
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం‌తో ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం.. ఆ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగడం సంప్రదాయంగా వస్తుంది. అయితే గత కొంతకాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. 

గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ, అధికార దుర్వినియోగం‌ ఎక్కువైందంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదే బాటలో కేసీఆర్ ‌కూడా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా రాజ్‌భవన్‌కు, ముఖ్యమంత్రికి గ్యాప్ మరింతగా పెరిగిందని అర్ధమవుతుంది. కేంద్రంపై పోరుబాట పట్టిన కేసీఆర్.. ఈ విధంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

గత కొంతకాలంగా ప్రోటోకాల్ వివాదం..
అయితే ఈ ఏడాది రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడులకపై సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంతో గవర్నర్‌‌కు, కేసీఆర్‌కు మధ్య దూరం పెరిగిందనే చర్చ మొదలైంది. అలాగే గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌ మేడారం జాతర పర్యటన సమయంలో తెలంగాణ సర్కార్ ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్