రూ. 1571 కోట్లతో నిమ్స్ విస్తరణ పనులు: కేసీఆర్ భూమి పూజ

By narsimha lode  |  First Published Jun 14, 2023, 12:20 PM IST

హైద్రాబాద్ లో  నిమ్స్ విస్తరణ  పనులకు  తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ  భూమి పూజ నిర్వహించారు


హైదరాబాద్: నిమ్స్ విస్తరణ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు భూమి పూజ నిర్వహించారు.  నిమ్స్ లో  కొత్త బ్లాక్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే  ఇవాళ దశాబ్ది బ్లాక్  నిర్మాణ పనులకు  కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు.  రెండు వేల పడకలతో  నిమ్స్ లో కొత్త బ్లాక్ ను నిర్మించనున్నారు.  రూ. 1571 కోట్లతో  32 ఎకరాల విస్తీర్ణంలో  కొత్త బ్లాక్ ను నిర్మించనున్నారు.

నిమ్స్ విస్తరణ పనులు  పూర్తైతే  మరో రెండువేల పడకలు  అందుబాటులోకి వస్తాయి. ఎనిమిది అంతస్తులతో  ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు  వేల  పడకలతో దేశంలోనే  అతి పెద్ద ఆసుపత్రుల జాబితాల్లో  నిమ్స్  చేరనుంది.  ఇన్ పేషేంట్ల కోసం  13 ఫ్లోర్లతో మరో బ్లాక్ ను నిర్మించనున్నారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ  సేవలకు నిమ్స్ లో ప్రత్యేకంగా బ్లాక్స్  ఏర్పాటు  చేయనున్నారు.   మొత్తం  మూడు బ్లాకులుగా  దశాబ్ది టవర్ ను నిర్మిస్తున్నారు. 

Latest Videos

కొత్త భవనంలో  మొత్తం  30 ఆపరేషన్ థియేటర్లను  ఏర్పాటు  చేయనున్నారు.  నిమ్స్  లో నిర్మిస్తున్న దశాబ్ది బ్లాక్ లో  రెండువేల  పడకలకు  ఆక్సిజన్  కూడ ఏర్పాటు  చేయనున్నారు. కరోనా వంటి  వైరస్ లు వ్యాపించిన సమయంలో ఆసుపత్రుల్లో బెడ్స్ లేక  రోగులు ఇబ్బందులు పడడంతో  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

click me!