రెండో విడత న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు.
హైదరాబాద్:ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న సేవల గురించి ప్రజల్లో మరింత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.బుధవారంనాడు నిమ్స్ లో రెండో విడత కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను సీఎం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు.
2023-24లో వైద్య ఆరోగ్య శాఖకు రూ. 12,367 కోట్లు కేటాయించినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. స్వంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను తయారు చేసుకున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అనేది చాలా ముఖ్యమైందన్నారు. 2014లో వైద్య ఆరోగ్యశాఖకు రూ. 2, 100 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆరోగ్యశాఖ అత్యంత కీలకమైందిగా భావించామన్నారు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఇవ్వవడం వెనుక చాలా ఆలోచన ఉందని సీఎం చెప్పారు.వైద్య ఆరోగ్య రంగంపై చక్కటి ప్రణాళికలు రూపొందించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై సహజంగా విమర్శలే ఎక్కువగా ఉంటాయన్నారు ఈ శాఖను ప్రశంసించే వారి తక్కువగా ఉంటారని కేసీఆర్ చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో పీఆర్ ను పెంచాలని కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు సూచించారు.
undefined
గతంలో పోలీస్ శాఖ అంటే ప్రజల్లో భయం ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం పోలీస్ శాఖ ప్రజలతో స్నేహంగా ఉంటున్నారన్నారు. సామాన్యుల నుండి వ్యాపారుల వరకు పోలీసుల విషయంలో ఇదే విషయాన్ని చెబుతున్నారని సీఎం చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో ఈ రకమైన పరిస్థితి నెలకొనాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ సూచించారు.
also read:రూ. 1571 కోట్లతో నిమ్స్ విస్తరణ పనులు: కేసీఆర్ భూమి పూజ
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు సీఎం. హైద్రాబాద్ లో మరో నాలుగు ఆసుపత్రులను కడుతున్నామన్నారు. రాష్ట్రంలో బాలింత మరణాలు, శిశు మరణాలు తగ్గాయన్నారు. వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని సీఎం చెప్పారు. వైద్య రంగం ఇంకా గొప్పగా ఉండాలన్నారు. హెల్త్ సిస్టం పటిష్టంగా ఉంటే తక్కువ ప్రాణ నష్టం ఉంటుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.