రాష్ట్రంలోని ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులను సీఎం కేసీఆర్ ఇశాళ ప్రారంభించారు.రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో మెడికల్ కాలేజీల సంఖ్యనుగణనీయంగా పెంచుకున్నట్టుగా కేసీఆర్ గుర్తుచేశారు.
హైదరాబాద్: దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా మారుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు.తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు రాష్ట్రంలోని ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించారు.ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా మారుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు.ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం గర్వకారణంగా ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర చరిత్రలో ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతాలకు మెడికల్ కాలేజీలు వస్తాయని కూడా ఎవరూ ఊహించలేదన్నారు సీఎం కేసీఆర్.కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చేందుకు మంత్రి హరీష్ రావు ఎంతో కృషిచేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మెడికల్ సీట్లు 2790 పెరిగాయన్నారు. గతంలోని సీట్లకు ఇది నాలుగు రెట్లు ఎక్కువని కేసీఆర్ చెప్పారు.పీజీ సీట్లు కూడా1180కి పెరిగిన విషయాన్నిసీఎం గుర్తు చేశారు.
అనేక సమస్యలతో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. తాగు,సాగునీటితో పాటుమెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారన్నారు.స్వంత రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతూ కొత్త కొత్త పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.ఇవాళ ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం గర్వకారణంగా కేసీఆర్ పేర్కొన్నారు.గతంలో నాలుగు మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలో ప్రారంభించుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.మహబూబ్ నగర్,సిద్దిపేట,నల్గొండ,సూర్యాపేటలో మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నట్టుగా సీఎం గుర్తు చేశారు.
మంచిర్యాల,రామగుండం, జగిత్యాల,వనపర్తి,నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం,సంగారెడ్డిలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించుకుంటున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.మహబూబాబాద్ ,వనపర్తి లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు అవుతాయని ఎవరూ కూడా ఊహించబోరని ఆయన చెప్పారు.మెడికల్ కాలేజీల ఏర్పాటులో హరీష్ రావు కృషిని కేసీఆర్ కొనియాడారు.ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ప్రభుత్వ రంగంలో 16 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టుగా కేసీఆర్ చెప్పారు.మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలోనే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
వచ్చే ఏడాది 17 జిల్లాల్లో ప్రభుత్వమెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్ల పెరుగుదలతో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్ధులకు మంచి అవకాశాలు దక్కనున్నాయన్నారు. ఆసుపత్రుల్లో పారా మెడికల్ సిబ్బంది నియామకం కోసం కేబినెట్ ఆమోదం తెలిపిందని కేసీఆర్ గుర్తుచేశారు. పారా మెడికల్ కోర్సులను చదువుకొనే విద్యార్ధుల కోసం కాలేజీలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ కాలేజీల్లో చదువుకొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని సీఎం కోరారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వేల కోట్లు వైద్యంపై ఖర్చు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం వైద్య విద్యార్ధులను కోరారు. ఏదైనా సమస్యలుంటే మంత్రి హరీష్ రావుతో పాటు వైద్య శాఖాధికారులను సంప్రదించాలని సీఎం సూచించారు.వైద్యరంగంలో తెలంగాణను దేశం కూడా అనుసరించే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.