సంగారెడ్డిలో టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది.బాణసంచా కాల్చే సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు.వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
సంగారెడ్డి: పట్టణంలో టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. బైక్ ర్యాలీ సందర్భంగా బాణసంచా పేల్చే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.బాణసంచా ఒకేసారి పేలడంతో అక్కడే ఉన్న పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు.వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.బాణసంచా ఉన్న ఆటోకు నిప్పంటుకుని బాణసంచా పేలింది.దీంతో భారీ శబ్దంతో ఆటోలోని బాణసంచా పేలింది.ఈ సమయంలో అక్కడే ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తృటిలో తప్పించుకున్నారు. పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు.
సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరం నుండే సంగారెడ్డి మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. సంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని మరో ఏడు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ తరగతులను సీఎం ప్రారంభించారు.ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీని తలపెట్టారు. ర్యాలీకి ముందు బాణసంచా పేల్చి తమ హర్షాన్ని వ్యక్తం చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం తలపెట్టింది. అయితే అదే సమయంలో ఆటోలో ఉన్న బాణసంచాపై నిప్పురవ్వలు పడ్డాయి.దీంతో బాణసంచా ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న పలవురు టీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు.స్థానికులు వెంటనే ఆటోలో మంటలను ఆర్పివేశారు.గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు స్వల్ప గాయాలయ్యాయి.గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.