ఢిల్లీకి కోమటిరెడ్డి, ఈటల:అమిత్ షాతో భేటీ కానున్న బీజేపీ నేతలు

By narsimha lode  |  First Published Nov 15, 2022, 11:19 AM IST

మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడానికి  బీజేపీ నేతలు ఈటల రాజేందర్ ,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఇవాళ ఢిల్లీ వెళ్లారు.
 


హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మంగళవారంనాడు ఢిల్లీకి వెళ్లారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.ఈ నెల 3 వ తేదీన  మునుగోడు ఉప ఎన్నిక జరిగింది.ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని భావించిన బీజేపీకి ఈ ఎన్నికల్లో ఊహించనిఫలితం రావడంతో కొంత నిరాశ నెలకొంది. ఉప ఎన్నిక తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రితో ఈటల రాజేందర్ ,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు చర్చించనున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.అదే నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే స్థానం  నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Latest Videos

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది.గత ఏడాది నుండి బీజేపీ వ్యూహత్మకంగా రాష్ట్రంలో పావులు కదుపుతుంది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఈటల రాజేందర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.బీజేపీలో చేరడానికి ముందే అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సమావేశమైన విషయం తెలిసిందే.

రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా  దిశా నిర్ధేశం చేసే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీ నుండి మూడు రోజులపాటు బీజేపీ  మూడు  రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహించనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకుగాను ఈ శిక్షణ  తరగతులు దోహదపడుతాయని ఆ  పార్టీ భావిస్తుంది.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర త్వరలోనే నిర్వహించే అవకాశం  ఉంది.పార్టీ నాయకులతో బండి సంజయ్ ఈ విషయమై చర్చించారు.పార్టీ శిక్షణ తరగతులపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించారు.

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ అంశం బీజేపీ,టీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధానికి దారి తీసింది. ఈ అంశంతో తమకు సంబంధం లేదని బీజేపీ  తేల్చిచెప్పింది.ఎమ్మెల్యేల ప్రలోభా ల వెనుక బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

click me!