మజ్లిస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. తమకు మజ్లిస్ పార్టీ మిత్రపక్షమని ఆయన తేల్చి చెప్పారు.
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ తమకు ఎప్పటికి మిత్రపక్షమేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో కూడ మజ్లిస్ ను కలుపుకుని పోతామన్నారు. బ్రహ్మణులకైనా, మైనార్టీలకు బహిరంగంగా మంచి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆదివారంనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన స్వల్పకాలిక చర్చపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అయితే బీఆర్ఎస్ ఎప్పుడూ లౌకిక పార్టీయేనని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తే బీజేపీకి బీ టీమ్ అంటూ కాంగ్రెస్ విమర్శలు చేసిందన్నారు. తాను మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించిన సమయంలో తనపై కూడ బీజేపీ బీ టీమ్ అంటూ విమర్శలు చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడ రూ. 4 వేల పెన్షన్ ఇస్తుందా అని ఆయన ప్రశ్నించారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారన్నారు. అయితే రూ. 4 వేల పెన్షన్ ఎలా ఇస్తారని కేసీఆర్ అడిగారు.
also read:గుండు జాడలేదు...ప్రవచనకారుడిలా సెల్ఫ్ సర్టిఫికెట్: బండి, భట్టిలపై కేసీఆర్ సెటైర్లు
అలవి కానీ హమీలను తాము ఎప్పుడూ ఇవ్వబోమన్నారు. ఉద్యోగుల పే స్కేల్ కూడ పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. అతి త్వరలోనే ఉద్యోగులకు కూడ ఐఆర్ అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.ఆర్ధిక వనరులు సమకూరగానే ఉద్యోగుల జీతాలు మళ్లీ పెంచుతామన్నారు. సింగరేణి కార్మికులకు త్వరలోనే వెయ్యి కోట్లను డివిడెండ్ గా పంచుతామని కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనకు తమ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని కేసీఆర్ వివరించారు. తమ పాలనలో ప్రజలకు ఏ రకంగా న్యాయం జరిగిందో వివరించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఎత్తి చూపారు.