తెలంగాణ సచివాలయ పనులను సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు పరిశీలించారు.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయ పనులను సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఉదయం పరిశీలించారు. వచ్చే నెలలో తెలంగాణ సచివాలయ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సచివాలయ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశలిస్తున్నారు.
తెలంగాణ సచివాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వాస్తవానికి గత నెల 17వ తేదీన తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కత్త సచివాలయ నిర్మాణ పనులు వాయిదా పడ్డాయి. మరో వైపు తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున అంబేద్కర్ జయంతి రోజున ఈ సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రజాశాంతి పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయమై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
undefined
ఇవాళ కొత్త సచివాలయంలో పూర్తైన పనులు , ఇంకా పెండింగ్ లో ఉన్న పనుల విషయమై కేసీఆర్ ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత అంబేద్కర్ విగ్రహ పనులను కేసీఆర్ పరిశీలించారు.
also read:ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయ ప్రారభోత్సవం: హజరు కానున్న తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు
తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులకు 2019 జూన్ 27న కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు.సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. గత ఏడాది దసరా నాటికే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ అప్పటికీ కూడ పనులు పూర్తి కాలేదు. దీంతో కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్త సవివాలయ ప్రారంభం వాయిదా పడింది.
కొత్త సచివాలయం పార్కింగ్ స్థలంలో 300 కార్లు, ఆరు వందల ద్విచక్రవాహనాలు పార్క్ చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ , రెండు, మూడో అంతస్థుల్లో కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు ఉంటాయి. ఏడో అంతస్థులో సీఎం కేసీఆర్ చాంబర్ ఉంటుంది.