తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

Published : Aug 17, 2022, 07:34 PM IST
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

సారాంశం

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ బుధవారం నాడు పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను గంటపాటు ఆయన పరిశీలించారు. 

హైదరాబాద్:తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ బుధవారం నాడు  సాయంత్రం పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను సుమారు గంటన్నర పాటు పరిశీలించారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం  పరిశీలించేందుకు వచ్చారు.  సెక్రటేరియట్  భవనంలోనే గంటకు పైగా గడిపి సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పపనులు జరుగుతున్న తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. 

ఆరు అంతస్థుల ఎత్తులో నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు.  ఈ ఏడాది దసరా నాటికి కొత్త సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ నెల 21వ తేదీ లోపుగా  ఈ సచివాలయంలో ఒక బ్లాక్ కు పూజ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని సమాచారం. ఈ నెల 21 తేదీ దాటితే  మంచి ముహుర్తాలు లేనందున  ఈ లోపుగా కనీసం ఒక్క బ్లాక్ లోనైనా పూజలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.

గతంలో కూడా నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించి కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం మరింత పెంచాలని సీఎం కేసీఆర్ సమయంలో అధికారులకు సూచించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!