ప్రతీ పథకం వెనుక సుదీర్ఘ కసరత్తు: మహబూబ్ నగర్‌ కొత్త కలెక్టరేట్ ప్రారంభించిన కేసీఆర్

By narsimha lode  |  First Published Dec 4, 2022, 2:19 PM IST


మహబూబ్ నగర్ లో  కొత్త కలెక్టరేట్  కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారంనాడు ప్రారంభించారు. 


మహబూబ్ నగర్: తెలంగాణ సీఎం  కేసీఆర్  ఆదివారంనాడు మహబూబ్ నగర్ కొత్త కలెక్టరేట్  భవనాన్ని ప్రారంభించారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  కొత్త కలెక్టరేట్  కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కొత్త కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు పూర్తి కాగానే ఆ  భవనాలను కేసీఆర్ ప్రారంభించారు.ఇటీవల కాలంలో  వరుసగా  పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లను కేసీఆర్  ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కేసీఆర్  ఇవాళ  మహబూబ్ నగర్  కలెక్టరేట్  కార్యాలయాన్ని ప్రారంభించారు.

మహబూబ్ నగర్ పట్టణంలోని  పాలకొండ గ్రామ పరిధిలో కొత్త కలెక్టరేట్  భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలో బస్టాండ్ కు సమీపంలోనే జిల్లా కలెక్టరేట్  భవనం ఉంది. అయితే  మహబూబ్ నగర్ జిల్లాను నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాగా విభజించారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాకు కొత్త కలెక్టరేట్  కార్యాలయాన్ని నిర్మించారు. ఆయా కొత్త జిల్లాల్లో కూడ కొత్త కలెక్టరేట్లను నిర్మించిన విషయం తెలిసిందే. 
  కలెక్టర్ చాంబర్ లో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ ను తన సీట్లో  సీఎం కేసీఆర్ కూర్చొబెట్టారు. 

Latest Videos

undefined

also read:మహబూబ్‌నగర్ లో టీఆర్ఎస్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేసీఆర్

అనంతరం  నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. ఏడేళ్ల క్రితం తెలంగాణ బడ్జెట్  60 వేల కోట్ల మాత్రమేనన్నారు. ప్రస్తుతం  మూడు లక్షల కోట్లకుపైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.గతంలో  భయంకరమైన విద్యుత్  కోతలుండేవన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు.పాలమూరులో  కొత్త కలెక్టరేట్  కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా  ఉందన్నారు.వేధనలు, రోధనలతో బాధపడ్డ పాలమూరు ఇవాళ సంతోషంగా  ఉందని కేసీఆర్  చెప్పారు. ఏ తెలంగాణ కోసం పోరాడామో ఆ దిశగా  ముందుకు సాగుతున్నామని కేసీఆర్ వివరించారు.సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ  రాష్ట్రమే భేష్ అని కేసీఆర్  చెప్పారు.

తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాని వెనుక సుదీర్థ కసరత్తు ఉందన్నారు.రాష్ట్రంలో  గురుకులాలను ఇంకా పెంచుతామన్నారు. తన నియోజకవర్గంలో  ఓ గ్రామంలో  ప్రజలకు వైద్య శిభిరం నిర్వహిస్తే  90 శాతానికి పైగా  కంటి చూపు జబ్బులున్నాయని తేలిందన్నారు. దీన్ని దృష్టిలో  పెట్టుకొనే  కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. కంటి వెలుగు ఓట్ల కోసం  తెచ్చింది కాదన్నారు. కేసీఆర్ కిట్  తీసుకురావడం  తీసుకురావడం  వెనుక  ఉద్దేశ్యాన్ని కేసీఆర్  ఈ  సందర్భంగా వివరించారు. రాష్ట్రంలోని పలువురు మహిళా ఐఎఎస్ అధికారులు పలు రాష్ట్రాల్లో  పర్యటించిన ప్రభుత్వానికి  నివేదిక ఇచ్చారని  కేసీఆర్  చెప్పారు. అనంతరం కేసీఆర్  కిట్ ను తీసుకువచ్చినట్టుగా  కేసీఆర్  వివరించారు. సంస్కరణ అనేది  అంతం కాదని సీఎం కేసీఆర్  చెప్పారు. కాలానుగుణంగా  కొత్త సంస్కరణకు శ్రీకారం చుడతుతున్నట్టుగా కేసీఆర్  తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే అభివృద్ది సాధ్యమని కేసీఆర్ చెప్పారు.

  

 


 

click me!