మహబూబ్‌నగర్ లో టీఆర్ఎస్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేసీఆర్

Published : Dec 04, 2022, 01:57 PM IST
మహబూబ్‌నగర్ లో  టీఆర్ఎస్  నూతన భవనాన్ని ప్రారంభించిన కేసీఆర్

సారాంశం

మహబూబ్‌నగర్ లో టీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రారంభించారు.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ లో  టీఆర్ఎస్  జిల్లా కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు  ప్రారభించారు. ఇవాళ ఉదయం ప్రగతి భవన్  నుండి  కేసీఆర్ భారీ కాన్వాయ్ తో  తెలంగాణ సీఎం కేసీఆర్  మహబూబ్ నగర్ కు చేరకున్నారు. మహబూబ్ నగర్ కు చేరుకున్న కేసీఆర్  టీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలుత  పార్టీ కార్యాలయంలో  టీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం  ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

తెలంగాాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  రాష్ట్రంలోని పలు జిల్లాలో టీఆర్ఎస్  పార్టీ భవన నిర్మాణాలను ఆ పార్టీ చేపట్టింది. నూతన  పార్టీ భవనాల నిర్మాణాలు పూర్తికావడంతో  ఒక్కో  జిల్లాలో పార్టీ భవనాలను కేసీఆర్  ప్రారంభిస్తున్నారు. అంతేకాదు  కొత్త జిల్లాల్లో  కొత్త కలెక్టరేట్  భవనాలను నిర్మించారు. కొత్త జిల్లాల్లో  టీఆర్ఎస్  పార్టీ కార్యాలయంతో పాటు కొత్త కలెక్టరేట్ ల నిర్మాణాలను కేసీఆర్  ఇటీవల కాలంలో  వరుసగా  ప్రారంభిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు