సెంట్రల్ యూనివర్శిటీలో కీచక ప్రొఫెసర్: రవి రంజన్ సంగారెడ్డి జైలుకు తరలింపు

By narsimha lode  |  First Published Dec 4, 2022, 1:13 PM IST

సెంట్రల్  యూనివర్శిటీకి చెందిన కీచక ప్రొఫెసర్  రవిరంజన్ ను పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు.  విద్యార్ధినిపై లైంగిక దాడికి యత్నించారనే ఆరోపణలతో  ప్రొఫెసర్  రవిరంజన్ ను అరెస్ట్  చేశారు పోలీసులు.


హైదరాబాద్: సెంట్రల్  యూనివర్శిటీకి చెందిన కీచక ప్రొఫెసర్ రవిరంజన్ ను రిమాండ్ కు తరలించారు పోలీసులు. కోర్టు ఆదేశం  మేరకు సంగారెడ్డి  జిల్లా జైలుకు ఆయనను తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రవిరంజన్ ను పోలీసులు అరెస్ట్  చేశారు. థాయ్‌లాండ్ కు చెందిన విద్యార్ధినికి హిందీ భాష నేర్పిస్తామని చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ  విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు  కీచక ప్రొఫెసర్  రవిరంజన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ  విద్యార్ధులు  హైద్రాబాద్  సెంట్రల్ యూనివర్శిటీ ఎదుట ఆందోళనకు దిగారు.  అంతేకాదు ప్రొఫెసర్  రవిరందజన్ ను  సస్పెండ్  చేసినట్టుగా  హైద్రాబాద్  సెంట్రల్ యూనివర్శిటీ ప్రకటించింది. 

1993 నుండి  యూనివర్శిటీ ఆఫ్  హైద్రాబాద్ లో  ప్రొఫెసర్  రవిరంజన్  పనిచేస్తున్నాడు.ఈ నెల 1వ తేదీన రాత్రి  బాధితురాలిని   ప్రొఫెసర్ తన ఇంటికి పిలిచాడు. ఆ  సమయంలో  ప్రొఫెసర్ బాధితురాలికి  డ్రింక్ లో  మత్తు మందు కలిపి ఇచ్చాడు. అయితే ఈ డ్రింక్ ను ఆ యువతి పూర్తిగా తాగలేదు. అయితే  పూర్తిగా  ఆ యువతి మత్తులోకి దిగలేదు. అదే సమయంలో  యువతిపై  నిందితుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడుఇది గమనించిన  యువతి కేకలు వేసింది. అంతేకాదు బాధితులు ఇతర ప్రొఫెసర్లకు సమాచారం ఇచ్చింది. దీంతో  బాధితురాలిని  క్యాంపస్ వద్దకు తీసుకువెళ్లాలని  సూచించారు. దీంతో  ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్  బాధితురాలిని  క్యాంపస్ వద్ద దింపాడు. ఈ  సమయంలో  ఆ యువతి ఏడుస్తూ  కన్పించింది.దీంతో  సహచర విద్యార్ధులు  ఆమెను ప్రశ్నించారు. అయితే బాధితురాలు  అసలు విషయం తెలిపింది.

Latest Videos

undefined

ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు  కేసు నమోదు చేశారు. ఐపీసీ  సెక్షన్లు 354ఎ, 328 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ  కేసు కింద  ప్రొఫెసర్  ను  అరెస్ట్  చేశారు. పోలీసులు. విచారణలో కీలక విషయాలను గుర్తించారు. గతంలో  కూడా  ప్రొఫెసర్  కొందరు విద్యార్ధినులపై ఇదే తరహలోనే లైంగిక దాడికి పాల్పడినట్టుగా  గుర్తించారు. బాధిత విద్యార్ధినులు ఎవరికీ  ఫిర్యాదు చేయలేదు. దీంతో  ప్రొఫెసర్  రవి రంజన్  పై కేసులు నమోదు కాలేదు. 


 

click me!