తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారంనాడు మెదక్ లో ఎస్పీ, కలెక్టరేట్ నూతన భవనాలను ప్రారంభించారు.
మెదక్: మెదక్ లో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారంనాడు ప్రారంభించారు. ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ నుండి మెదక్ కు చేరుకన్న సీఎం కేసీఆర్ ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్లను ప్రారంభించారు. అంతకుముందే మెదక్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో కొత్త కలెక్టర్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలను ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 24 కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల్లో అన్ని హంగులతో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను నిర్మించింది ప్రభుత్వం. కలెక్టరేట్ కార్యాలయాలకు సమీపంలోనే అధికారుల నివాస గృహాలను కూడ నిర్మించింది ప్రభుత్వం.
undefined
జిల్లా ఎస్పీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ని కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు సీఎం
సీఎం కేసీఆర్ ను శాలువాతో సత్కరించి, మెమెంటో అందించారు ఎస్పీ.
ఆ తర్వాత నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అక్కడి నుండి కొత్త కలెక్టరేట్ కు వెళ్లి నూతన కలెక్టరేట్ ను ప్రారంభించారు సీఎం. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో సీఎం కేసీఆర్ ,మంత్రులు ఎమ్మెల్యేలు, సి ఎస్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 19 వ తేదీన మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటన జరగాలి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ నెల 19వ తేదీన జరగాల్సిన ఈ భవనాల ప్రారంభోత్సవాలను ఇవాళ్టికి వాయిదా వేసుకున్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత తొలిసారిగా మెదక్ కు సీఎం కేసీఆర్ వచ్చారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత మెదక్ లో జరిగే సభ నుండి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్నారు.