కేసీఆర్ సంచలన నిర్ణయం: నరేంద్ర మోడీతో దోస్తీ కారణంగానే....

By telugu teamFirst Published Dec 31, 2020, 7:55 AM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాజకీయంగా చర్చ సాగుతోంది.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వస్తి చెప్పినట్లే కనిపిస్తున్నారు. ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఆరోగ్యశ్రీతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంపై కేసీఆర్ విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ పథకాన్ని చులకన చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత కేసీఆర్ వైఖరిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఈ స్థితిలో ఆయన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతునన్నారు. 

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథఖాన్ి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేశారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో సోమేష్ కుమార్ ఆ విషయం చెప్పారు. 

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేసీఆర్ నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన పరోక్షంగా వాటికి మద్దతు చెప్పారు. ఎల్ఆర్ఎస్ ను ఎత్తేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

click me!