అనుమానాస్పదంగా తొమ్మిదేళ్ల చిన్నారి ఉరి ! కారణం అదేనా.. !!

By AN TeluguFirst Published Mar 29, 2021, 2:55 PM IST
Highlights

గతవారం ఉరేసుకుని చనిపోయిన తొమ్మిదేళ్ల చిన్నారి నెనావత్ శ్రీనిధి కేసులో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్చి 23 మంగళవారంనాడు హైదరాబాద్, సైదాపేట ప్రాంతంలోని ఖాజా కాలనీలోని ఉండే ఈ చిన్నారి తమ ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. 

గతవారం ఉరేసుకుని చనిపోయిన తొమ్మిదేళ్ల చిన్నారి నెనావత్ శ్రీనిధి కేసులో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్చి 23 మంగళవారంనాడు హైదరాబాద్, సైదాపేట ప్రాంతంలోని ఖాజా కాలనీలోని ఉండే ఈ చిన్నారి తమ ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. 

కాగా శ్రీనిధి తల్లిదండ్రులు ఆమె మరణం విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే చిన్నారి మృతిని అనుమానాస్పద మరణంగా కేసును నమోదు చేశారు, అయితే ఇది ప్లే-యాక్ట్ వల్ల జరిగిన పొరపాటుగా అధికారులు అంటున్నారు. 

శ్రీనిధి తల్లిదండ్రులు కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మార్చి 23న వారు ఇంటికి వచ్చేసరికి శ్రీనిధి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఘటన సమయంలో అక్కడున్న ఆమె తోబుట్టువులు, కజిన్స్ చెప్పడం ద్వారానే ఆమె చనిపోయినట్టు ఇరుగుపొరుగు వారికి, కుటుంబసభ్యలుకు తెలిసింది. 

స్కిప్పింగ్ ఆడే తాడుతో ఆమె రూఫ్ కి వేలాడుతూ కనిపించింది. చెల్లె చనిపోవడాన్ని గమనించిన ఆమె సోదరి కుర్చీ ఎక్కి తాడు కోసిందని సైదాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు. 

ప్రత్యాక్ష సాక్షులైన పిల్లల కథనం ప్రకారం... శ్రీనిధి తనతో పాటు గుడికి రావద్దని  తమ్ముడిని హెచ్చరించింది. అయితే వాడు వినకుండా వస్తానని మారాం చేయడంతో.. అలాగైతే తాను ఉరి వేసుకుంటానని బెదిరించిందని, రెండుసార్లు ప్రయత్నించిందని తాము అడ్డుకున్నామని తెలిపారు. 

సరదాగా ఆడుకునే సమయంలో జరిగిన విషాదం అని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక తుది నివేదిక ఇస్తామని వారు అంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు శ్రీనిధి మృతి విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తన్నారని, అయితే ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించినా తమకు తెలియజేయమని వారికి చెప్పామని పోలీసులు అంటున్నారు. అసలు విషయాలు దర్యాప్తులో తేలతాయని అంటున్నారు. 
 

click me!