కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్: యాంటిజెన్ టెస్ట్‌లో నెగిటివ్, రేపు ఆర్టీపీసీఆర్‌ రిజల్ట్

By Siva Kodati  |  First Published Apr 28, 2021, 7:23 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. సీఎంకు నిర్వహించిన యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం రేపు రానుంది. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. సీఎంకు నిర్వహించిన యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం రేపు రానుంది. కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో కేసీఆర్ కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎంకు కరోనా సోకడం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు.

కొద్దిరోజుల క్రితమే ఆయన నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. మరోవైపు నోముల భగత్‌కు కూడా కరోనా సోకింది.

Latest Videos

undefined

ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. ఫామ్ హౌస్‌లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నిపుణులైన వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.

Also Read:యశోదాలో వైద్య పరీక్షలు పూర్తి.. నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం: వ్యక్తిగత వైద్యుడు

ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సీటీ స్కాన్‌తో పాటు ఆరు రకాల పరీక్షలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.

సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగానే వున్నాయని.. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్తపరీక్షల కోసం శాంపిల్స్‌ను తీసుకున్నట్లు చెప్పారు. రక్తపరీక్షలు రేపు రానున్నాయి.

సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే వుందని.. త్వరలో కోలుకుంటారని ఎంవీ రావు తెలిపారు. ఆయనకు కోవిడ్ లక్షణాలు పోయాయని.. పూర్తి ఆరోగ్యంగా వున్నారని, త్వరలోనే విధులుకు హాజర్యే అవకాశం వుందని డాక్టర్ చెప్పారు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగానే వున్నాయని ఎంవీ రావు పేర్కొన్నారు.
 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!