హరీష్ రావు లేకుండానే: గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్

By narsimha lode  |  First Published Nov 9, 2023, 11:34 AM IST

గజ్వేల్, కామారెడ్డి  అసెంబ్లీ నియోజకవర్గాల నుండి కేసీఆర్  పోటీ చేస్తున్నారు.  గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి  2014 నుండి  కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 



హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారంనాడు గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు.  ఇవాళ ఉదయం  గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి  గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చారు.  అక్కడి నుండి తన వాహనంలో  ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి  నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ పత్రాలు  సమర్పించిన తర్వాత  కేసీఆర్ ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ  స్థానిక బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు.

కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో  మంత్రి హరీష్ రావు  ఆయనతో లేరు . గత రెండు ఎన్నికల సమయాల్లో  కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసిన సమయాల్లో హరీష్ రావు  కేసీఆర్ తో పాటు ఉన్నారు.  అయితే  కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసే సమయానికి  హరీష్ రావు కూడ  సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది.  దీంతో హరీష్ రావు  ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.  సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత  దుబ్బాకకు  హరీష్ రావు వెళ్లాల్సి ఉంది. ఇవాళ ఉదయమే కొండగట్టు ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  సిద్దిపేటలోని పలు ఆలయాల్లో కూడ పూజలు చేశారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. 

Latest Videos

undefined

గజ్వేల్ ఆర్‌డీఓ కార్యాలయంలో  తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.    నామినేషన్ దాఖలు చేసిన తర్వాత స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి  కేసీఆర్  ఓపెన్ టాప్ వాహనంలో  ప్రజలకు అభివాదం చేశారు.  అనంతరం అక్కడి నుండి కేసీఆర్ కామారెడ్డికి బయలుదేరారు.  కామారెడ్డిలో  నామినేషన్ దాఖలు చేస్తారు. కామారెడ్డి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు.  

 

గజ్వేల్‌ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్‌ నామినేషన్‌ కార్యక్రమం https://t.co/n0SqosExu4

— BRS Party (@BRSparty)

ఈ దఫా  కామారెడ్డి, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుండి కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు.  2014 నుండి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  2014 ఎన్నికల సమయంలో  మెదక్ ఎంపీ, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశారు. అయితే మెదక్ ఎంపీ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో  కేసీఆర్ విజయం సాధించారు.  మెదక్ ఎంపీ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు.ఈ స్థానంలో కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది. 2014 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఈ దఫా  కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానంనుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  మె

click me!