సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి కేసీఆర్ సంతాపం

Published : Feb 19, 2023, 04:14 PM ISTUpdated : Feb 19, 2023, 04:55 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్  ఎమ్మెల్యే సాయన్న మృతికి కేసీఆర్ సంతాపం

సారాంశం

సికింద్రాబాద్  కంటోన్మెంట్  ఎమ్మెల్యే  సాయన్న  మరణం పట్ల  తెలంగాణ సీఎం  కేసీఆర్  సంతాపం తెలిపారు.  సాయన్నతో  తనకు  ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు  చేసుకున్నారు.    

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల తెలంగాణ  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  సంతాపం ప్రకటించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాదపడుతున్న సాయన్న  ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే.  

also read:సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

ఐదు సార్లు ఎమ్మెల్యే గా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను కేసీఆర్ గుర్తు  చేసుకున్నారు. సాయన్నతో తనకు  ఉన్న అనుబంధాన్ని సీఎం  స్మరించుకున్నారు.  సాయన్న కుటుంబ సభ్యులకు  కేసీఆర్ సానుభూతిని తెలిపారు.  

 

సికింద్రాబాద్ కంటోన్మెంట్  ప్రజల  శ్రేయస్సు కోసం  సాయన్న  నిరంతరం  తపించేవారని  తెలంగాణ మంత్రి కేటీఆర్  గుర్తు  చేసుకున్నారు.   అనారోగ్య  కారణాలతో  సాయన్న మృతి చెందడంపై  కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం  చేశారు.  సాయన్న కుటుంబసభ్యులకు  సానుభూతిని  తెలిపారు. 

సికింద్రాబాద్  కంటోన్మెంట్  ఎమ్మెల్యే  సాయన్న మృతికి   మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  సంతాపం తెలిపారు.   1994 అసెంబ్లీ  ఎన్నికల  ముందు  కార్పోరేట్  గా  పనిచేసిన   తలసాని శ్రీనివాస్ యాదవ్  గుర్తు  చేశారు.   కంటోన్మెంట్  ప్రజల అభిమానంతో  సాయన్న  ఐదు సార్లు  విజయం సాధించారన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?