సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారంనాడు కన్నుమూశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా సాయన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ కూడ ఆయన అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించే లోపుగానే సాయన్న మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. సాయన్న వయస్సు 72 ఏళ్లు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
1951 మార్చి 5న సాయన్న జన్మించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి సాయన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీ నుండి సాయన్న రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాయన్న టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
1994లో టీడీపీ అభ్యర్ధిగా సాయన్న తొలిసారిగా ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి నాలుగు దఫాలు టీడీపీ అభ్యర్ధిగా సాయన్న విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు.
కిడ్నీ సంబంధిత సమస్యలతో సాయన్న బాధపడుతున్నారు. దీంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ సాయన్న అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స ప్రారంభించేలోపుగానే సాయన్న మృతి చెందాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి నాలుగు దఫాలు టీడీపీ అభ్యర్ధిగా సాయన్న విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు.
చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ప్రకటించిన టీటీడీ పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రం నుండి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సాయన్నకు చోటు కల్పించారు.
హైద్రాబాద్ ఆశోక్ నగర్ లోని నివాసానికి సాయన్న పార్థీవదేహన్ని తీసుకువచ్చారు. సాయన్న మృతి చెందిన విషయం తెలుసుకున్న సాయన్న అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.