అభివృద్ది చెందుతున్న రాష్ట్రాలకు బెనిఫిట్స్ ఇవ్వాలి: కెసిఆర్

First Published Jun 17, 2018, 1:00 PM IST
Highlights

నీతి ఆయోగ్ సమావేశంలో కెసిఆర్ కీలక వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: అభివృద్ది చెందుతున్న రాష్ట్రాలకు బెనిఫిట్స్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగం ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం నాడు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రసంగించారు.ఏడు అంశాలపై తెలంగాణ సీఎం కెసిఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలోని 50 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలను కల్పించినట్టు చెప్పారు. రైతాంగానికి భీమా సౌకర్యం కల్పించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడిందని కెసిఆర్ గుర్తు చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేసినట్టు ఆయన గుర్తు చేశారు. వ్యవసాయాన్ని ఉపాధి హమీని  అనుసంధానం చేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. డెయిరీ, కోళ్ళు, మత్స్య పరిశ్రమను జీఎస్టీ నుండి మినహాయించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

click me!