తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కన్నుమూత

Published : Jun 16, 2018, 01:17 PM IST
తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కన్నుమూత

సారాంశం

మలిదశ ఉద్యమంలో ప్రోఫెసర్ జాదవ్ కీలకపాత్ర


హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు  ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ శనివారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన శ్వాసకోశవ్యాధితో బాధపడుతున్నాడు. జాదవ్ వయస్సు 86 ఏళ్ళు.  ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన కొంత కాలం క్రితం చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఆయన శనివారం నాడు మృతిచెందారు.1933 జనవరి 27న హైదరాబాద్‌ హుస్సేనిఆలంలో జాదవ్‌ జన్మించారు. 

తెలంగాణ సాయుధ పోరాటం, నాన్‌ముల్కీ గో బ్యాక్‌ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంలో కేశవరావు జాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ తెలంగాణ జేఏసీ ద్వారా జయశంకర్‌, కోదండరామ్‌తో కలిసి జాదవ్‌ పనిచేశారు. కెసిఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ ఏర్పాటు కాకముందు నుండే తెలంగాణ కోసం  మలిదశ పోరాటంలో కేశవరావు జాదవ్ కీలకంగా  పనిచేశారు. 

PREV
click me!

Recommended Stories

Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి