డిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్...నూతన జోనల్ వ్యవస్థ ఆమోదమే ప్రధాన ఎజెండాగా...

By Arun Kumar PFirst Published Aug 25, 2018, 12:38 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అభ్యంతరాలకు వివరన ఇచ్చి ఆమోదం పొందేందకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం ఆయన ఇవాళ డిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధానితో పాటు వివిధ శాఖల మంత్రులతో చర్చించి కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదింపజేసుకునే లక్ష్యంగా సీఎం కేసీఆర్ డిల్లీ పర్యటన సాగుతోంది.

నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత అందుకు అనుగుణంగా జోనల్ వ్యవస్థలో కూడా తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. అయితే ఈ జోనల్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం పలు అభ్యంతరాలను తెలుపుతూ ఆమోదించడం లేదు. ముఖ్యంగా ఇందులో 95 శాతం స్థానికులకు, 5 శాతం స్థానికేతరులకు ఉద్యోగాలు కేటాయించడంపై అభ్యంతరాలున్నట్లు కేంద్రం తెలిపింది.

అయితే కొత్తగా తెలంగాణలో పంచాయితీలు భారీగా పెరగడంతో వాటిలో సుపరిపాలన కోసం పంచాయతీ సెక్రటరీల ఉద్యోగాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నియామకాలతో పాటు పలు శాఖల్లో ఉద్యోగాలను నూతన జోనల్ సిస్టం ప్రకారం భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం దీన్ని ఆమోదింపచేసుకోవాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం ఆయన సాయంత్రం ప్రధాని మోదీతో బేటీ కానున్నారు. ప్రధాని కార్యాలయం తెలిపిన అభ్యంతరాలపై కేసీఆర్ ప్రధానికే వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.

click me!