వరవరరావు అరెస్ట్.... ట్యాంక్ బండ్ పై ప్రజాసంఘాల నిరసన

By Arun Kumar PFirst Published 29, Aug 2018, 3:05 PM IST
Highlights

ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న అనుమానంతో విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావును మహారాష్ట్ర పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటితో పాటు కూతుళ్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. చివరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని మహారాష్ట్రకు తరలించారు. 

ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, ఈ కుట్రతో సంబంధాలున్నట్లు ఆరోపిస్తూ  విప్లవ రచయిత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతుళ్ల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. అలాగే మరికొంత మంది ఇళ్లలో కూడా సోదాలు చేసిన పోలీసులు చివరకు వరవరరావును అరెస్ట్ చేయడం జరిగింది.

ఆదారాలు లేకుండా విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ప్రజాసంఘాలు తప్పుబట్టాయి.  ఇందుకు నిరసనగా ఇవాళ ట్యాంక్ బండ్ పై గల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, విప్లవ నాయకులు, తెలంగాణ వాదులు నిరసనకు దిగాయి.

దీంతో పోలీసులు ఈ నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రజా సంఘాల నాయకులు సంధ్య,రవిచంద్ర, లక్ష్మణ్, కోటి, ఉష, గీతాంజలిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.  
  

Last Updated 9, Sep 2018, 11:10 AM IST