ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని గోల్కోండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు.కానీ, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండింది.
ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని గోల్కోండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం ఏడాదికి 1500 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రభుత్వం అందించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలితంగానే ఆర్టీసీ సంస్థ గతంలో కంటే ఇప్పుడు కొంత మెరుగైన ఫలితాలను సాధించగలుగుతోందన్నారు. కానీ, నష్టాలు మాత్రం తప్పడంలేదని సీఎం చెప్పారు. ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రభుత్వం వారిలో ఆనందం నింపిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
undefined
పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై యాజమాన్య హక్కులు కలిగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు పథకాన్ని సైతం వర్తింపజేస్తూ పంట పెట్టుబడి సాయం అందించిందన్నారు. పోడు భూముల కోసం జరిగిన ఆందోళనల్లో నమోదైన కేసుల నుంచి విముక్తి చేసి విషయాన్ని సీఎం ప్రస్తావించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ప్రభుత్వం ఉచితంగా పేదలకు అందిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు.దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.మిషన్ భగీరథకు నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్ అవార్డులతో సహా అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం పార్లమెంటు వేదికగా ప్రకటించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.
దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్నివర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలను అందజేస్తూ తెలంగాణ సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుందన్నారు సీఎం.దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని ప్రభుత్వం 6 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచినట్టుగా సీఎం చెప్పారు.ఈ పథకం వర్తించే ఆలయాల సంఖ్యను కూడా పెంచామన్నారు. రైతు బీమా తరహాలో గీతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా కల్పించినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు.''తెలంగాణ చేనేత మగ్గం’’ అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు.నేతన్నలకు పైసా భారం లేకుండా 5 లక్షల రూపాయల బీమాను కల్పిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ వివరించారు.
also read:రూ.37 వేల కోట్ల పంట రుణాలు మాఫీ: గోల్కోండకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకొక వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే విధాన నిర్ణయం తీసుకొని స్వల్పకాలంలోనే 21 వైద్య కశాళాలలను ప్రారంభించిందన్నారు. మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఇటీవలనే క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.108, 104 సేవలను పెంచాలనే ఉద్దేశంతో ఇటీవలనే కొత్తగా 466 వాహన సేవలను ప్రారంభించుకున్నామన్నారు. ఫోన్ చేసిన 15 నిముషాల లోపు ఈ వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చి సేవలందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వమే అక్కున చేర్చుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు.