మోడీ ఐదు రాష్ట్రాల్లో తిరిగాడు.. నేను హాలియాలో సభ పెట్టకూడదా : విపక్షాలపై కేసీఆర్ విమర్శలు

By Siva KodatiFirst Published Apr 14, 2021, 7:04 PM IST
Highlights

సభ జరగకూడదని.. మీరు, నేను కలవకూడదని కొందరు చేయని ప్రయత్నం చేయలేదంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ... విపక్షాల వైఖరి ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో తల తోకా లేని వ్యవహారమంటూ ఆయన మండిపడ్డారు.

సభ జరగకూడదని.. మీరు, నేను కలవకూడదని కొందరు చేయని ప్రయత్నం చేయలేదంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ... విపక్షాల వైఖరి ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో తల తోకా లేని వ్యవహారమంటూ ఆయన మండిపడ్డారు.

ఎవరైనా సరే సభలు పెట్టుకుని, ప్రజల్లోకిపోయి మంచి చెడ్డలు చెప్పి తమకు మద్ధతు పలకాలని కోరుతారని కేసీఆర్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారం చేశారని ఆయన  గుర్తుచేశారు. ఈ కల్చర్ ఎక్కడా కనిపించలేదని.. కానీ తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ తన సభ జరగనీయొద్దని చాలా ప్రయత్నించారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

తాను చెప్పిందే మీరే చేయాలని నేను అనలేదని.. గ్రామాల్లో అందరూ చర్చించుకుని మీ ఓటు వేయాలని గతంలో హాలియా సభలో చెప్పినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. నిజానిజాలు గమనించాలని.. గాడిదలకు గడ్డేసి, ఆవులకు పాలు పితికితే పాలు రావని, ముండ్ల చెట్లు పెట్టి పండ్లు కాయాలంటే కాయవని.. పండ్ల చెట్లు పెడితేనే కాయలు కాస్తాయని కేసీఆర్ సెటైర్లు వేశారు.

దాదాపుగా ఒక నెల నుంచి గ్రామాల్లో చర్చలు జరుగుతున్నాయని.. ఎవరు గెలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ది చెందుతుందో మీకు తెలుసునని చెప్పారు. నోముల నర్సింహయ్య తనకు మంచి మిత్రుడని.. లెఫ్ట్ రాజకీయాల్లో ఆయన ఎన్నో ప్రజా పోరాటాలు చేశారని సీఎం కొనియాడారు. సాగర్‌లో నోముల భగత్‌కే టికెట్ కేటాయించామని.. ఇక్కడ పరిస్ధితి చూస్తుంటే భగత్ గాలి బాగానే వున్నట్లు కనిపిస్తోందన్నారు.

దీనిని 17వ తేదీ నాటికి కొనసాగించాలని కేసీఆర్ కోరారు. అలంపూర్‌లో కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం లొంగిపోతే.. అక్కడి ఆర్‌డీఎస్ కాలువ వద్ద లిఫ్ట్ పెట్టామని సీఎం గుర్తుచేశారు. దానికి తగ్గట్టుగానే టీఆర్ఎస్‌కు అక్కడి ప్రజలు ఓట్లు వేశారని కేసీఆర్ తెలిపారు. తిరుమలగిరి సాగర్ ప్రాజెక్ట్ ఒకటిన్నర సంవత్సరంలోగా పూర్తి చేయకుంటే రాజీనామా చేస్తామని మంత్రి ఛాలెంజ్ చేశారని సీఎం వెల్లడించారు. బిచ్చమెత్తయినా సరే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. 
 

click me!