తెలంగాణ: బెడ్లు, మందుల కొరతపై ఈటల రాజేందర్ స్పందన

By Siva KodatiFirst Published Apr 14, 2021, 5:34 PM IST
Highlights

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై స్పందించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 15-20 శాతం మంది ఆసుపత్రుల్లో చేరేవారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై స్పందించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 15-20 శాతం మంది ఆసుపత్రుల్లో చేరేవారని గుర్తుచేశారు.

ఇప్పుడు 95 శాతం మంది లక్షణాలు లేకుండా వుంటున్నారని మంత్రి వెల్లడించారు. టిమ్స్‌లో ప్రస్తుతం 450 మంది రోగులు చికిత్స పొందుతున్నారని ... బెడ్స్, మందులు అందుబాటులో వున్నాయని రాజేందర్ పేర్కొన్నారు.

సిబ్బంది కొరత లేదని.. కొత్త వారిని తీసుకుంటున్నామని ఈటల చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,691 నర్సింగ్ హోమ్స్ అందుబాటులో వుంచామని మంత్రి స్పష్టం చేశారు.

41 వేల బెడ్స్, 10 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో వున్నాయని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఎవరికైనా సీరియస్‌గా వుంటే గాంధీకి పంపిస్తున్నారని రాజేందర్ వెల్లడించారు. 

Also Read:తెలంగాణ కరోనాఅప్ డేట్: 25వేలు దాటిన యాక్టివ్ కేసులు

మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 72,364మందికి కరోనా టెస్టులు చేయగా 2157మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,738కు చేరితే టెస్టుల సంఖ్య 1,12,53,374కు చేరాయి. ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 821మంది కోలుకున్నారు.

దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,07,499కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,459యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 16,892గా వుంది.  
 

click me!